మీరు టోల్ గేట్ వద్ద మూడు నిమిషాల కంటే ఎక్కువ సమయం వేచి ఉన్నారా? అయితే టోల్ టాక్స్ చెల్లించనవసరం లేదు. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికారక సంస్థ (NHAI) ఒక వ్యక్తికి తెలిపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే.. హరిఓం అనే వ్యక్తి టోల్ గేట్ వద్ద మూడు నిమిషాలకు పైగా నిరీక్షించాడు. దీని వల్ల సమయం వృధా అయిపోతుంది కదా? అని ఆలోచించాడో ఏమోగానీ.. అడ్వకేట్ అయిన హరిఓం జిందాల్ సమాచార హక్కు చట్టం 2005 ద్వారా  NHAI కి అభ్యర్థన దాఖలు చేసాడు. ఈ దరఖాస్తుకు పై అధికారుల నుండి సమాధానం వచ్చింది. "మూడు నిమిషాల కంటే ఎక్కువ సమయం వాహనదార్లు క్యూలో ఉంటే..వారు టోల్ టాక్స్ (టోల్ చార్జీ) చెల్లించకుండా వెళ్ళవచ్చు" అని అధికారులు స్వయంగా పేర్కొన్నారు. దానికి సంబంధించిన లెటర్ ను కూడా పేస్ బుక్ లో పోస్టు చేసాడు హరిఓం జిందాల్. 


ఇంకా చాలా మందికి తెలియనివి


*టోల్ గేట్ నుండి 200 మీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయినా మీరు టోల్ చెల్లించనవసరం లేదు.


* మీ బండి ఎల్లో లైను వెనక వుండి, మీరు 5 నిమిషాలు లేదా 5 నిమిషాల కన్న ఎక్కువసేపు వేచి వుంటే మీరు టోల్ ఫ్రీ అయిపోవచ్చు. 


అంటే పై మూడు స్థితులలో మీరు టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే వెళ్ళి పోవచ్చు. ఇది చాలా మందికి తెలియదు. అందరికీ తెలియ పరచి టోల్ గేట్ వాళ్ల అవినీతికి అడ్డుకట్ట వేయండి.