Earthquake Hits Delhi, Noida, Ghaziabad: ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని ఆనుకుని ఉన్న నొయిడాలో బుధవారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 1.5 మ్యాగ్నిట్యూడ్ గా నమోదైంది. నొయిడాతో పాటు ఆ పక్కనే ఉన్న ఘజియాబాద్, గౌతం బుద్ధ నగర్ ప్రాంతాల్లోనూ భూమి కొన్ని క్షణాలపాటు కంపించింది. ఢిల్లీ, నొయిడా, గురుగ్రామ్, ఘాజియాబాద్ వంటి ప్రాంతాల్లో తరచుగా భూకంపాలు వస్తుండటం అక్కడి ప్రాంతాల వాసులను హడలెత్తిస్తోంది. చాలా సందర్భాల్లో రాత్రి వేళ భూకంపాలు సంభవిస్తుండటంతో రక్షణ కోసం భూకంపం రాగానే ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీస్తున్న జనం.. ఆరుబయటే గంటల తరబడి బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక భూకంపం మరువక ముందే మరో భూకంపం అన్నట్టుగా వస్తున్న ఈ భూ ప్రకంపనలు ఆ రాత్రుళ్లు తమకి నిద్ర కరువయ్యేలా చేస్తున్నాయని ఆయా ప్రాంతాల వాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం భూకంపం తీవ్రత అధికంగా లేకపోవడంతో అదృష్టవశాత్తుగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని తెలుస్తోంది. 



ఇది కూడా చదవండి : Loan Application For Defaulters: లోన్ ఎగ్గొట్టిన వాళ్లు మళ్లీ లోన్ కోసం అప్లై చేస్తే వస్తుందా ?


గౌతం బుద్ధ నగర్ లోనే ఎపిసెంటర్ ఉందని గుర్తించినట్టు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈ భూకంపానికి సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ అందాల్సి ఉంది.


ఇది కూడా చదవండి : Hyundai Cars Discount Mela: కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. హ్యూందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.