North India Rain Fury: భారీ వర్షాలకు ఉత్తర భారతదేశం అతలాకుతలం అవుతోంది. దేశరాజధాని సహా చాలా రాష్ట్రాలు ఈ వరద విలయంలో చిక్కుకున్నాయి. ఈ జల ప్రళయానికి ఇప్పటి వరకు 100 మందికిపైగా బలైనట్లు తెలుస్తోంది. అత్యధికంగా హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh)లోనే 80 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాలకు రోడ్లు కోట్టుకుపోవడం, కొండ చరియలు విరిగిపడటం వల్ల ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. ఆ రాష్ట్రంలో సుమారు 4వేలకోట్లకు పైగా ఆస్తినష్టం వాటిల్లినట్లు సమాచారం. హిమచల్ పర్వత ప్రాంతాల్లో దాదాపు 300 మంది టూరిస్టులు చిక్కుకుపోయారు. కొండ చరియలు విరిగిపడి పంజాబ్ లో 15 మంది, ఉత్తరాఖండ్ లో 9 మంది చనిపోయారు. ఢిల్లీ,  రాజస్థాన్ పంజాబ్‌, జమ్మూ కశ్మీర్‌, హరియాణల్లో కూడా భారీగా వర్షపాతం నమోదైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వానల ధాటికి నార్త్ ఇండియాలోని నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా యమునా నది ఎన్నడూ లేనంతగా ఉగ్రరూపం దాల్చింది. ప్రమాదకర స్థాయి అయిన 205.33 మీటర్లను దాటి 207.18 మీటర్లకు చేరింది. గత 10 ఏళ్లలో ఇదే అత్యధికం. ఈస్థాయిలో నీటమట్టం 1978లో నమోదైంది. హర్యానా రాష్ట్రం భారీ స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉండటంతో పాత యమున వంతెనపై ట్రాఫిక్ ను పూర్తిగా నిలిపేశారు. భారీ వర్షాలకు దేశరాజధానిలో ఐదుగురు మృతి చెందారు. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని నైనిటాల్‌, చంపావత్‌, ఉదమ్‌సింగ్‌నగర్‌, పౌరీగఢ్‌వాల్‌ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. పంజాబ్‌లో ఘగ్గర్‌ నది ఉద్దృతంగా ప్రవహిస్తుండటంతో చాలా గ్రామాలు నీటమునిగాయి.


Also Read: Yamuna danger mark: ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోన్న యమునా నది.. ఆందోళనలో రాజధాని వాసులు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook