Uttarakhand: భారీ వర్షాలకు ఉప్పొంగిన గంగానది.. హరిద్వార్‌కు అలర్ట్..
Uttarakhand flood: భారీ వర్షాలు ఉత్తర భారతంలో బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా యమునా, గంగా నదులు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో హరిద్వార్ వద్ద అలర్ట్ జారీ చేశారు.
Uttarakhand Rains effect: భారీ వర్షాల (Heavy Rains)తో ఉత్తరాది రాష్ట్రాలు వణుకుతున్నాయి. వర్షాలతోపాటు ఎగువ నుంచి వస్తున్న వరదనీటితో ఇప్పటికే యమునా నది ప్రమాదకర స్థాయిని దాటింది. దేశరాజధాని ఢిల్లీ ఇంకా వరద నీటిలోనే ఉంది. ఎర్రకోట, రాజ్‌ఘాట్ తదితర ప్రాంతాల్లో ఇంకా వరద నీరు నిలిచే ఉంది.
మరోవైపు ఉత్తరాఖండ్ (Uttarakhand)లో గంగానది కూడా ఉగ్రరూపం దాల్చింది. భారీ వర్షాలతో అలకనంద నదిపై ఉన్న జీవీకే హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ డ్యామ్ కళకళ్లాడుతోంది. దీంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో దేవప్రయాగ వద్ద గంగా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది.
ముఖ్యంగా హరిద్వార్ (Haridwar) వద్ద గంగానది 293 మీటర్ల ప్రమాదకర స్థాయిను దాటి డేంజర్ గా మారింది. దీంతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రజలను తరలిస్తున్నారు. అంతేకాకుండా అధికారులు అలర్ట్ జారీ చేశారు. హరిద్వార్, రూర్కీ, ఖాన్‌పుర్, భగవాన్‌పుర్, లస్కర్ పరిధిలోని అనేక గ్రామాల్లో వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Also Read: Fire in Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు, మధ్యప్రదేశ్ లో ఘటన..
ఈ వర్ష బీభత్సానికి ఉత్తరాఖండ్ రాష్ట్రవ్యాప్తంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. అంతేకాకుండా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ భారీ వర్షాలకు 17 రోడ్లు, తొమ్మిది వంతెనలు దెబ్బతిన్నాయి. ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేయడంతో.. 13జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
Also Read: Rs. 10,000 for Flood Victims: వరద బాధితులకు ఒక్కో కుటుంబానికి రూ. 10 వేలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook