NTA NEET UG Exam 2023: ఎన్టీఏ నీట్ యూజి ఎగ్జామ్ 2023 కి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
NTA NEET UG Exam 2023: నీట్ అండర్‌గ్రాడ్యూయేట్ 2023 సిలబస్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ.. ఇలా మొత్తం మూడు సబ్జెక్టులు ఉంటాయి. NEET UG 2023 ప్రవేశ పరీక్షలో 11, 12 తరగతులకు చెందిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి.
NTA NEET UG Exam 2023: అండర్ గ్రాడ్యుయేట్స్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇవాళే ప్రారంభమైంది. NTA NEET UG 2023 ఎగ్జామ్ ఈ ఏడాది మే 7 న నిర్వహించనున్నారు. నీట్ యూజీ 2023 కోసం అప్లై చేసే ఔత్సాహిక అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in లోకి లాగాన్ అవడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు నీట్ 2022 తరహాలోనే ఈ ఏడాది నిర్వహించే నీట్ అండర్‌గ్రాడ్యూయేట్ పరీక్ష కూడా ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రవేశ పరీక్ష 720 మార్కులు ఉంటాయి.
నీట్ అండర్‌గ్రాడ్యూయేట్ 2023 సిలబస్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ.. ఇలా మొత్తం మూడు సబ్జెక్టులు ఉంటాయి. NEET UG 2023 ప్రవేశ పరీక్షలో 11, 12 తరగతులకు చెందిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి.
ఎలా దరఖాస్తు చేయాలంటే..
NEET అధికారిక వెబ్‌సైట్ www.neet.nta.nic.in లోకి లాగాన్ అవండి.
దరఖాస్తు ఫారమ్ కోసం లింకుపై క్లిక్ చేయండి.
అక్కడ కోరిన సమాచారం పొందుపర్చిన తరువాత మీ కాంటాక్ట్ డీటేల్స్ ఎంటర్ చేయండి.
మీ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, స్కాన్ చేసిన 10వ తరగతి సర్టిఫికెట్స్ కాపీలను అప్‌లోడ్ చేయండి.
నీట్ యూజీ 2023 పరీక్ష దరఖాస్తు రుసుమును చెల్లించండి.
మీ అప్లికేషన్‌ని నిర్ధారిస్తూ వచ్చే కన్‌ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేయండి.
భవిష్యత్ అవసరాల కోసం డౌన్‌లోడ్ చేసిన కాపీని భద్రపర్చుకోండి.