దేశంలో ఇంజనీరింగ్ విభాగంలో అత్యున్నత విద్యాసంస్థలు ఐఐటీలు. ఆ తరువాత ఎన్ఐటీలు. ఇందులో ప్రవేశం కోసం జరిగే JEE Main 2023 Notification వెలువడింది. మొదటి సెషన్ జనవరిలో, రెండవ సెషన్ ఏప్రిల్‌లో ఉండనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2023 సంవత్సరం జేఈఈ మెయిన్స్ పరీక్షకై సన్నద్ధమౌతున్న విద్యార్ధులకు అతి ముఖ్యమైన సమాచారం. జేఈఈ మెయిన్స్ 2023 పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి జనవరి 24 నుంచి 31 వరకూ జేఈఈ మెయిన్స్ పరీక్ష ఉంటుంది. జనవరి 26 మినహాయించి ప్రతిరోజూ పరీక్షలు ఉంటాయి. అదే విధంగా జేఈఈ మెయిన్స్ రెండవ సెషన్ మాత్రం ఏప్రిల్ 2023లో ఉంటుంది. 


ఎలా అప్లై చేయాలి


ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్స్  jeemain.nta.nic.in , nta.nic.in లలో పరీక్ష తేదీలు, సిలబస్ వంటి ఇతర వివరాలుంటాయి. జేఈఈ మెయిన్స్ 2023 దరఖాస్తులు ఇవాళ్టి నుంచే ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 15 నుంచి జనవరి 12 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. సైట్ ఓపెన్ చేసిన తరవాత సెషన్ 1 పై క్లిక్ చేయాలి. ఆ తరువాత న్యూ క్యాండిడేట్ క్లిక్ చేసి రిజిస్టర్ చేయాలి. లాగిన్ వివరాలు సమర్పించాలి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఫోటో, సిగ్నేచర్ అప్‌లోడ్ చేసి సబ్మిట్ ప్రెస్ చేయడమే. జేఈఈ మెయిన్స్ అడ్మిట్ కార్డు జనవరి మూడవ వారంలో వస్తుంది. చివరి వారంలో పరీక్షలుంటాయి.


జేఈఈ మెయిన్స్ పరీక్షలు బీఈ, బీటెక్ కోర్సులకై నిర్వహిస్తారు. ఇవి పేపర్ 1 కు సంబంధించి ఉంటాయి. ఇక పేపర్ 2 బీఆర్చ్, బీ ప్లానింగ్ కోసం ఉంటుంది. జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ను 2023 జనవరిలోనూ, సెషన్ 2ను ఏప్రిల్ నెలలోనూ నిర్వహించనున్నారు. రెండు సెషన్లలో పొందిన మార్క్స్ ఆధారంగా ర్యాంక్ నిర్ణయమౌతుంది. 


Also read: Holidays 2023: 2023 సంవత్సరం సెలవుల్ని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, మొత్తం ఎన్నంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook