'కరోనా' మహమ్మారితో భారత దేశం సామూహిక యుద్ధం చేస్తోంది. ఐనప్పటికీ వైరస్ లొంగిరావడం లేదు. రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేల చేరువకు చేరుతోంది. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తంగా 49 వేల 391 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ సంక్షేమ, ఆరోగ్య శాఖ తెలిపింది.  కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 16 వందల 94 మంది బలయ్యారు. ప్రస్తుతం 33 వేల 514 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు 14 వేల 183 మంది కరోనా వైరస్ కు దేశంలోని వివిధ ఆస్పత్రుల్లో  చికిత్స తీసుకుని సురక్షితంగా ఇళ్లకు వెళ్లారు.  


అలాగే.. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్న విధంగానే ..  గత 24 గంటల్లోనూ కేసుల సంఖ్య అధికంగానే నమోదైంది. నిన్న మొత్తంగా దేశంలో 2 వేల 958 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా నిన్న ఒక్కరోజే మరణించిన వారి సంఖ్య 126గా ఉంది. ఇది కూడా ఒక్క రోజు  మృతుల సంఖ్యలో రికార్డుస్థాయి మరణాలే కావడం విశేషం. ఐతే కరోనా వైరస్ సోకిన వారిలో రికవరీ రేటు రోజు రోజుకు పెరగడం కాస్త ఉపశమనం కలిగించే అంశం. నిన్న రికవరీ రేటు 28.71  శాతంగా ఉందని కేంద్రం వెల్లడించింది.  


దేశవ్యాప్తంగా మూడో దశ లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 17 వరకు లాక్ డౌన్ అమలు  చేయనున్నారు. ప్రస్తుతం నిత్యావసర వస్తువులతోపాటు మిగతా సరుకుల  దుకాణాలు కూడా తెరిచారు. ఐతే గ్రీన్, ఆరెంజ్, యెల్లో జోన్లలో మాత్రమే ఇలాంటి దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. రెడ్ జోన్లలో యధావిధిగా పటిష్టంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. 


మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. మొత్తంగా ఇప్పటి వరకు 37 లక్షల పాజిటివ్ కేసులు   నమోదయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 2.52 లక్షల మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. అన్ని  దేశాల కంటే అమెరికాలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది..జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..