కాబోయే ప్రధాని బాబా రాందేవ్: ఎన్‌వైటీ
భారత్‌కు కాబోయే ప్రధాని ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ అని ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్ (ఎన్‌వైటీ) అభిప్రాయపడింది.
భారత్‌కు కాబోయే ప్రధాని ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ అని ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్(ఎన్‌వైటీ) అభిప్రాయపడింది. డోనాల్డ్ ట్రంప్ మాదిరిగా రాందేవ్ కూడా బిలియనీయర్ అని, ప్రచారానికి ఎప్పుడూ దూరంగా ఉండరని, తన బ్రాండ్ పెంచుకోవడానికి ఆయన ఎక్కడికైనా వెళతారని తెలిపింది. కాగా మోదీ అధికారంలోకి రావడానికి వెనకుండి నడిపిన బిలియనీయర్ బాబా రాందేవ్ అనే పేరుతో ఈ వార్తను న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. 2014 ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతిచ్చిన వారిలో బాబా రాందేవ్ ఒకరు. బీజేపీ నేతలతో ఆయనకు సత్సంబంధాలే ఉన్నాయి.
కొన్ని రోజుల క్రితం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బాబా రాందేవ్‌ను కలిశారు. 'కాంటాక్ట్ ఫర్ సపోర్ట్' కార్యక్రమంలో భాగంగా యోగా గురువును కలిసిన ఆయన, 2014 ఎన్నికల్లో మాదిరే.. 2019లోనూ మద్దతు ఇవ్వాలని కోరినట్లు.. వచ్చే ఎన్నికల్లో తమ మద్దతుంటుందని యోగా గురువు హామీ ఇచ్చారని అమిత్ షా చెప్పారు. ఈ సందర్భంగా మోదీ నాయకత్వాన్ని, గత నాలుగేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను రాందేవ్ బాబా కొనియాడారు.