Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాద ఘటనలో కన్నీరు పెట్టించే ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. మరికాసేపట్లో ట్రైన్ దిగి ఇంటికి చేరుకుంటామనుకుని సంతోషపడిన వారు.. ఊహించని ప్రమాదంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తమ వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు పడుతున్నపాట్లు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఇప్పటివరకు 294 మంది దుర్మరణం చెందారు. 1,175 మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 100 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు. వారి కోసం ఢిల్లీ ఎయిమ్స్, ఆర్ఎమ్ఎల్ హాస్పిటల్ నుంచి వైద్య నిపుణులు, పరికరాలు, మందులు తెప్పించి చికిత్స అందిస్తున్నారు. అందరూ క్షేమంగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ రైలు ప్రమాదం నుంచి ఓ 8 ఏళ్ల బాలిక, ఆ చిన్నారి తండ్రి అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. కుమార్తె విండో సీటు కావాలని పట్టుపడితే.. రైలు ప్రమాదానికి కొద్దిసేపు ముందే వారు మూడు కోచ్‌లు మారి సీట్లు మార్చుకున్నారు. ఆ తరువాత వెంటనే ప్రమాదం జరిగింది. అదృష్టం బాగుండి ఇద్దరు సురక్షితంగా ఉన్నారు. 


దాబే అనే వ్యక్తి తన కుమార్తెతోపాటు ఖరగ్‌పూర్ నుంచి కటక్‌లో దిగాల్సిన రైలు ఎక్కారు. శనివారం తండ్రీకూతుళ్లు డాక్టర్‌తో అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. థర్డ్ ఏసీ టికెట్ తీసుకోగా.. విండో సీటు పక్కనే కూర్చొవాలని కూతురు పట్టుబట్టింది. దీంతో దాబే టీసీతో మాట్లాడగా.. ప్రస్తుతం విండో సీటు ఖాళీగా లేదని కావాలనుకుంటే మరొక ప్రయాణికుడితో మార్చుకోవాలని సూచించాడు. 


తన కుమార్తెను తీసుకుని దూబే విండో సీటు పక్కన ఉన్న ప్రయాణికులను బెర్త్ ఛేంజ్ చేసుకోవాలని అడిగాడు. వారి కోచ్ నుంచి రెండు కోచ్‌లను దాటి మూడవ కోచ్‌లోకి అడుగుతూ వచ్చారు. ఈ కోచ్‌లోని ఇద్దరు ప్రయాణీకులు తమ సీట్లను మార్చుకోవడానికి అంగీకరించారు. దాబే, ఆ చిన్నారి అక్కడ విండో పక్కన సీట్లో కూర్చుకున్నారు. ఈ ఇద్దరు ప్రయాణికులు దాబే సీట్లలోకి వెళ్లారు. ఇది జరిగిన కొద్ది నిమిషాలకే రైలు ప్రమాదం జరిగింది. తండ్రీకూతురు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. 


Also Read: Odisha Train Accident Updates: రైలు ప్రమాద బాధితులకు సీఎం జగన్ ఎక్స్‌గ్రేషియా.. ఏపీ వాసులను ఆదుకోవాలని ఆదేశం  


“మా దగ్గర విండో సీటు టికెట్ లేదు. విండో సీటు కావాలని టీసీని మేము  అభ్యర్థించాము. ఆయన వీలైతే ఇతర ప్రయాణికులతో మా సీట్లు మార్చుకోమని సూచించారు. వేరే కోచ్‌లో ఇద్దరు వ్యక్తులను రిక్వెస్ట్ చేయడంతో వారు అంగీకరించారు. మేము వారి సీట్లలో కూర్చొగా.. వారు మా అసలు కోచ్ వద్దకు వెళ్లారు. కాసేపటికే ప్రమాదం జరిగింది. మాతో కలిసి సీట్లు మార్చుకోవడానికి అంగీకరించిన ఇద్దరు ప్రయాణికుల పరిస్థితి గురించి మాకు తెలియదు. వారు క్షేమంగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని ప్రాణాలతో కాపాడిని భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము" అంటూ దాబే తెలిపాడు. 


దాబే సీట్లలో కూర్చున్న మరో ఇద్దరు ప్రయాణికులు కూడా ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. వారిద్దరికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. అయితే ఈ కోచ్ పూర్తిగా దెబ్బతింది. ఈ కోచ్‌లో చాలా మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.


Also Read: Odisha Train Accident Latest Updates: రైలు ప్రమాదంలో మరణించిన వారికి 35 పైసల బీమా వర్తిస్తుందా..? ఎంత డబ్బు వస్తుంది..?  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి