Corona Effect: దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తుండటం, ఒమిక్రాన్ వేరియంట్ భయాలు పెరుగుతుండటం (Omicron scare) నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1-5 వ తరవగతి విద్యార్థులకు సోమవారం నుంచి స్కూళ్లు తెరిచే ప్రణాళికను (Schools re Opening) వాయిదా వేసింది. ఈ మేరకు స్కూళ్లు, మాస్ ఎడ్యుకేషన్ మంత్రి అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైమరీ స్కూళ్లలో పర్యటించి, ప్రస్తుత పరిస్థితిలను సమీక్షించిన తర్వాత (COVID-19 spike).. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వారికి యథావిథికా క్లాసులు, పరీక్షలు..


'కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతుండటం, రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారుల తల్లిదండ్రుల నుంచి వచ్చిన వినతుల మేరకు స్కూళ్లు తెరవాలనే నిర్ణయాన్ని వాయిదా వేశాం' అని ఒడిశా మంత్రి పేర్కొన్నారు.


అయితే ప్రైమరీ స్కూళ్లకు మాత్రమే (1-5వ తరగతి వరకు) ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టం చేసింది ప్రభుత్వం. 6-10వ తరగతి విద్యార్థులకు యథావిథిగా ప్రత్యక్ష పద్ధతిలో క్లాసులు జరుగుతాయని వివరించింది. పరీక్షలు కూడా ముందుగా షెడ్యుల్​ చేసిన ప్రకారమే జరుగుతాయని పేర్కొంది. అయితే కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూనే ఈ ప్రక్రియ జరుగుతుందని పేర్కొంది.


ఒడిశాలో కరోనా కేసులు ఇలా..


ఒడిశాలో ఆదివారం 424 కరోనా కేసులు (Corona cases in Odisha) నమదయ్యాయి. దాదాపు రెండు నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. వీటితో కాలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 10,55,556 కేసులు నమోదయ్యాయి. మొత్తం 8,463 మంది కొవిడ్​తో మృతి చెందారు. ఒడిశా వ్యాప్తంగా అత్యధిక కేసులు భువనేశ్వర్​లోనే నమోదవుతున్నాయి. ఒక్క రోజులో ఇక్కడ 177 కేసులు నమోదవగా, కటక్​లో 45 కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్త కేసుల్లో 67 మంది చిన్నారులు ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్య విభాగం వెల్లడించింది.


Also read: Dog Bite CCTV Footage: నాలుగేళ్ల బాలికపై వీధి శునకాల దాడి.. చిన్నారికి తీవ్ర గాయాలు


Also read: West Bengal Lockdown: పశ్చిమ్ బెంగాల్​లో స్కూళ్లు, సినిమా హాళ్లు బంద్​- మళ్లీ లాక్​డౌన్​?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook