Oil India Jobs: నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలో ఉద్యోగాలు కొలువుదీరాయి. జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకై దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత ప్రభుత్వ రంగ సంస్థ నవరత్న కంపెనీ ఆయిల్ ఇండియా లిమిటెడ్‌(Oil India Limited)లో వందకు పైగా ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. ఆయిల్ ఇండియాలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం 120 ఖాళీలున్నాయి. ఇందులో ఎస్సీకు 8, ఎస్టీకు 14, ఓబీసీకు 32, జనరల్ కేటగరీ 54 ఉన్నాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. చివరి తేదీ ఆగస్టు 15 గా ఉంది. 40 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ కలిగి ఉండి 6 నెలల వ్యవధితో కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిప్లొమా సర్టిఫికేట్ ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎంస్ పవర్ పాయింట్, ఎంఎస్ ఎక్సెల్‌లో పరిజ్ఞానం ఉండాలి. ఆగస్టు 15, 2021 నాటికి 18-30 ఏళ్ల మధ్యలో ఉండాలి. జీతం 26 వేల 6 వందల రూపాయల్నించి 90 వేల వరకూ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 


ఇంగ్లీషు లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్, అవేర్‌నెస్, ఆయిల్ ఇండియాపై 20 శాతం మార్కులకు ప్రశ్నలుంటాయి. రీజనింగ్, అర్థమెటిక్, న్యూమరికల్ అండ్ మెంటల్ ఎబిలిటికు 20 శాతం మార్కులుంటాయి. డొమైన్ సంబంధిత టెక్నికల్ నాలెడ్జ్‌కు 60 శాతం మార్కులుంటాయి. మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నాపత్రం ఉంటుంది. అదృష్ఠవశాత్తూ నెగెటివ్ మార్కింగ్ లేదు. 


Also read: JEE Mains 2021 & NEET 2021 Exams: జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలు ఎప్పుడో తెలుసా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook