కొట్టాయం: కరోనా వైరస్ (COVID-19) పేరు వింటేనే ఇప్పుడు యావత్ దేశం నిలువునా వణికిపోతోంది. కరోనావైరస్ వేగంగా విస్తరిస్తున్న తీరు.. వ్యాధితో వస్తున్న లక్షణాలు (Coronavirus symptoms), సంభవిస్తున్న మరణాల సంఖ్యను (Fatalities) చూసే జనం హడలెత్తిపోతున్నారు. అయితే, కేరళకు చెందిన ఈ వృద్ధ దంపతులు మాత్రం కరోనాతో పోరాడి చివరకు విజయం సాధించి నవ్వుతూ ఆస్పత్రి నుండి బయటికొచ్చారు (Old age couple in Kerala recovered). 93 ఏళ్ల థామస్, 88 ఏళ్ల థ్రెశ్యమ్మ దంపతులకు కరోనా వైరస్ పాజిటివ్‌గా ఉంది అని తేలినప్పుడు తొలుత అందరూ హడలిపోయారు. ఈ వృద్ధాప్యంలో ఈ జంటకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కడుంటుంది ? ఎలా తట్టుకుంటారు అనే  సందేహాలే ఎక్కువ వినిపించాయి. కానీ ఆ సందేహాలేవి థామస్ దంపతుల్లో నిరాశను నింపలేదు. ధైర్యంగా కరోనాతో పోరాడి విజయం సాధించారు. చికిత్స అనంతరం తాజాగా వారికి కరోనా వైరస్ టెస్టు నెగటివ్ అని తేలడంతో అధికారులు శుక్రవారం వారిని కొట్టాయం మెడికల్ కాలేజీ ( Kottayam Medical College) నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : 24 గంటల్లో 478 కేసులు.. 2500 దాటిన కోవిడ్ కేసులు


ధైర్యంతో పోరాడితే కరోనా వైరస్ అయినా తలవంచాల్సిందేనని ఈ ఘటనతో మరోసారి రుజువైందని వారికి వైద్యసహాయం అందించిన డాక్టర్లు అభిప్రాయపడ్డారు. కరోనా నివారణకు కృషి చేయాలే కానీ దాని ౘూసి కూడా భయపడాల్సిన అవసరం లేదని ఈ వృద్ధ దంపతులకు చికిత్స అందించిన డాక్టర్లు తెలిపారు. డాక్టర్లు చెప్పిన సూచనలు పాటిస్తూ మనోధైర్యంతో పోరాడి కరోనాను ఓడించొచ్చనే సందేశాన్ని ఇచ్చిన ఈ వృద్ధ దంపతులను నిజంగానే అభినందించకుండా ఉండలేం కదా. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..