Old Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. ఓపీఎస్‌పై కీలక ఉత్తర్వులు
OPS Latest Update: పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. ఇన్నాళ్లు ఈ విషయంపై మౌనం వహించిన ప్రభుత్వం ఎట్టకేలకు కీలక ప్రకటన చేసింది. ఓల్డ్ పెన్షన్ విధానంపై లేటెస్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా..
OPS Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. పాత పెన్షన్ విధానంపై కీలక అప్‌డేట్ వచ్చింది. ప్రభుత్వం తరపున ఒక పెద్ద అడుగు వేస్తూ.. ఎంపిక చేసిన కేంద్ర ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్‌ను ఎంచుకునే అవకాశం ఇచ్చింది. 2003 డిసెంబర్ 22వ తేదీలోపు ప్రకటనలు లేదా నోటిఫై చేసిన పోస్టుల కోసం సెంట్రల్ సర్వీసెస్‌లో చేరిన ఉద్యోగులకు ఒకసారి పాత పెన్షన్ ఆప్షన్ ఎంచుకునే అవకాశం ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేసింది.
ఈ ఉత్తర్వుల ప్రకారం.. పాత పెన్షన్ స్కీమ్‌ను సద్వినియోగం చేసుకోవడానికి అర్హులైన కేంద్ర ఉద్యోగులందరూ.. కొత్త ఆప్షన్‌ను ఎంచుకోవడానికి ఆగస్టు 31వ తేదీ వరకు సమయం ఇచ్చారు. అర్హత ఉన్న ఉద్యోగులు గడువు ముగిసేలోపు పాత పెన్షన్ స్కీమ్‌ను ఎంచుకోకపోతే.. వారు ఆటోమేటిక్‌గా కొత్త పెన్షన్ స్కీమ్ కింద కవర్ అవుతారు. అంటే ఆగస్టు 31వ తేదీలోపు అర్హులైన సెంట్రల్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఏ ఎంపికను ఎంచుకున్నా.. అది ఫైనల్‌గా పరిగణిస్తారు. గడువు ముగిసిన తరువాత పెన్షన్ స్కీమ్ ఎంపికను మార్చుకునే సౌకర్యం ఉండదని మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
2004లో సర్వీసుల్లో చేరిన సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ సిబ్బంది, ఇతర కేంద్ర ఉద్యోగులకు కూడా ఈ ఆర్డర్ వర్తిస్తుంది. అప్పట్లో పరిపాలనా కారణాల రీత్యా నియామక ప్రక్రియలో జాప్యం జరిగింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఖజనాపై మరింత భారం పడనుంది. ఉద్యోగుల ఎన్‌పీఎస్ కంట్రిబ్యూషన్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్)లో జమ అవుతుంది. పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించడం వల్ల ప్రభుత్వంపై అనవసర ఆర్థిక భారం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో తమకు కూడా పాత పెన్షన్ విధానమే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇన్నాళ్లు ఈ విషయంపై మౌనంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఓపీఎస్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook