Old Pension Scheme: ఎవడికి కావాలి ఈ పోస్ట్.. పార్టీకి వ్యతిరేకంగా బీజేపి అగ్ర నేత సంచలన వ్యాఖ్యలు
Gaurishankar Bisen About Old Pension Scheme: ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు గురించి గౌరీశంకర్ బిసేన్ మాట్లాడుతూ.. వృద్ధాప్యంలో భర్త భార్య తోడు.. భార్యకు భర్త తోడు ఎలాగైతే అవసరమో.. అలాగే వృద్ధాప్యంలో ఉన్న మాజీ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కూడా అంతే అవసరం అని అన్నారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు అవసరం ఎంతైనా ఉంది అని గౌరీ శంకర్ తన మాటలతో ఒక్కినొక్కానించి మరీ చెప్పారు.
Gaurishankar Bisen About Old Pension Scheme: బీజేపి సర్కారు తనను పదవి నుంచి తొలగించినా పర్వాలేదు.. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని అమలు చేయడమే కావాలి అని మధ్యప్రదేశ్ కి చెందిన ఒక బీజేపి అగ్ర నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ నేత ఎవరో కాదు.. బాలాఘాట్ నియోజకవర్గం నుంచి మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న గౌరీశంకర్ బిసెన్. ఆయన కేవలం ఒక బీజీపీ ఎమ్మెల్యే మాత్రమే కాదు.. మధ్యప్రదేశ్ రాష్ట్ర సర్కారులో భాగమైన అదర్ బ్యాక్ వార్డ్ కమిషన్ చైర్మన్ గానూ కొనసాగుతున్నారు.
ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు గురించి గౌరీశంకర్ బిసేన్ మాట్లాడుతూ.. వృద్ధాప్యంలో భర్త భార్య తోడు.. భార్యకు భర్త తోడు ఎలాగైతే అవసరమో.. అలాగే వృద్ధాప్యంలో ఉన్న మాజీ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కూడా అంతే అవసరం అని అన్నారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు అవసరం ఎంతైనా ఉంది అని గౌరీ శంకర్ తన మాటలతో ఒక్కినొక్కానించి మరీ చెప్పారు. మధ్యప్రదేశ్ సర్కారు చేసిన ప్రభుత్వ అభివృద్ధి యాత్రలో భాగంగా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న బాలాఘాట్ నియోజకవర్గంలో జనాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. గౌరిశంకర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
గౌరీశంకర్ బిసేన్ నిర్వహిస్తోన్న ఓబిసి కమిషన్ చైర్మన్ పదవి ఆయనకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ నియమించిన నామినేటెడ్ పోస్ట్. ఈ కారణ వల్లే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కి అనుకూలంగా సంచలన వ్యాఖ్యలు చేసిన గౌరీశంకర్ బిసెన్.. తన వ్యాఖ్యలపై ఒకవేళ బీజేపి ఆగ్రహం చెందిన తనను పార్టీలోంచి గెంటేసినా వెనుకాడేది లేదు.. తనను పదవి లోంచి తీసేసినా పర్వాలేదు అని వ్యాఖ్యానించారు.
ఇప్పటికే కాంగ్రస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు గుప్పిస్తూ వెళ్తోంది. మరోవైపు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలనే నినాదం ఉద్యమం రూపుదాలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయంగా మధ్యప్రదేశ్ సర్కారును ఇరకాటంలో పడేసేలా గౌరీశంకర్ బిసెన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకోవడమే కాకుండా చర్చకు దారితీశాయి. గౌరీ శంకర్ చేసిన వ్యాఖ్యలు బీజేపికి ఇబ్బందిగానే మారాయి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదిలావుంటే, ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ని సమర్ధిస్తూ గౌరీశంకర్ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ సర్కార్ ఇప్పటికైతే స్పందించనప్పటికీ.. పార్టీ నేతల్లో అంతర్గతంగా ఈ అంశంపై విభిన్నరకాల చర్చలు మాత్రం నడుస్తున్నాయి. గౌరీశంకర్ బిసేన్ వ్యాఖ్యలతో ఏకీభవించని వారు ఆయన్ను తీవ్రంగా తప్పుపడుతున్నారు. కేవలం రాబోయే ఎన్నికల్లో గౌరీశంకర్ బిసెన్ తనకు కానీ లేదా తన కూతురుకు కానీ పార్టీ టిక్కెట్ ఇప్పించుకోవడం కోసం స్వార్ధంతో చేస్తున్న బెదిరింపు రాజకీయాలుగా ఆయన వ్యాఖ్యలను అభివర్ణిస్తున్నారు. అంతకుమించి ఇందులో మరెలాంటి ప్రజా ప్రయోజనం లేదని గౌరీ శంకర్ తీరుపై విమర్శలపై గుప్పిస్తున్నారు.
మరి నిజంగానే గౌరీశంకర్ బిసెన్ ఊహించినట్టుగానే మధ్యప్రదేశ్ సర్కారు అతడిని ఓబిసి కమిషన్ చైర్మన్ పోస్ట్ నుంచి తప్పించి, పార్టీ ఆయన్ని బీజేపి నుంచి వెలేస్తుందా లేదా అతని సీనియారిటీకి విలువిచ్చి చూసీచూడనట్టు వ్యవహరిస్తుందా అనేది వేచిచూడాల్సిందే మరి. ఏదేమైనా బీజేపి అభిష్టానికి వ్యతిరేకంగా.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సమర్ధిస్తోన్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలనే డిమాండ్ కి అనుకూలంగా గౌరీ శంకర్ బిసెన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం బీజేపికి ఇరుకునపెట్టేవిగానే ఉన్నాయి.
ఇది కూడా చదవండి : Hyundai Creta Car: రూ. 12 లక్షల SUV కారు రూ. 4.75 లక్షలకే.. టెంప్ట్ చేస్తోన్న ఆఫర్
ఇది కూడా చదవండి : TVS Ronin: ధోని బైక్ కొన్నాడు.. 225CC పవర్‌ఫుల్ ఇంజన్.. ధర మాత్రం చాలా తక్కువే
ఇది కూడా చదవండి : Best Selling Hatchbacks: ఎక్కువగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇవే
ఇది కూడా చదవండి : PM Svanidhi Yojana: ఈ లోన్ తీసుకుంటే నయాపైస వడ్డీ లేదు.. గ్యారెంటీ అసలే లేదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook