చైనా సహా బ్రెజిల్, అమెరికా, జర్మనీ, దక్షిణ కొరియా దేశాల్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బి.7 ఇండియాలో ఎంట్రీ ఇచ్చేసింది. ఈ వేరియంట్ తీవ్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై..రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి మరోసారి వ్యాపిస్తుండటం, చైనాను గడగడలాడిస్తున్న కొత్త వేరియంట్ బి.7 ఇండియాలో ప్రవేశించడం కలకలం రేపుతోంది. కరోనా ఫోర్త్‌వేవ్‌కు దారితీయనుందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ క్రమంలో లాక్‌డౌన్, మాస్క్‌లు, శానిటైజర్లు, ఆన్‌లైన్ గేమింగ్స్, వర్క్ ఫ్రం హోం తిరిగి అమలు కానున్నాయా అనే సందేహాలు ఉత్పన్నమౌతున్నాయి. పొరుగుదేశం చైనాలో కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఆసుపత్రులు రోగులతో నిండి..ఫార్మసీలో మందులు లభ్యం కాక పరిస్థితి భయానకంగా ఉండటంతో ఇండియాలో ఆందోళన పెరుగుతోంది. 


చైనాలో కోవిడ్ 19 కేసులు భారీగా పెరగుతుండటంతో ఇండియా అప్రమత్తమై..రాష్ట్ర ప్రభుత్వాలకు పలు సూచనలు జారీ చేసింది. పరీక్షలు నిర్వహించడమే కాకుండా జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్స్‌కు పంపించాలని, కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని ఆదేశించింది. చండీగడ్‌లో అప్పుడే బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధారణ తప్పనిసరి చేశారు.


చైనాను వణికిస్తున్న బి.7 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఇండియాలో అప్పుడే 4 గుర్తించారు. ఇండియాలో కరోనా వైరస్ కేసులు పెరగకపోయినా..ప్రోటోకాల్ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అదే సమయంలో దేశంలో మరోసారి లాక్‌డౌన్ విధిస్తారా, మాస్క్ ధారణ తప్పనిసరి కానుందా, వర్క్ ఫ్రం హోం తిరిగి అమలు చేస్తారా అనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి.


తిరిగి పాత ఆంక్షలు రానున్నాయా


కోవిడ్ ఉన్నా లేకపోయినా కాలుష్యం, చలి, పొగమంచు నుంచి రక్షించుకునేందుకు మాస్క్ ఓ ఆయుధంగా ఉంది. మాస్క్ ధరించడం ఎప్పుడూ మంచిదే. ప్రజలు భయాందోళనకు గురి కావద్దని..బహిరంగ ప్రదేశాల్లో సామాజిక దూరం పాటించాలని సూచనలు జారీ అవుతున్నాయి. కోవిడ్ లేకపోయినా చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం  కొనసాగించడం లేదా హైబ్రిడ్ మోడల్ వర్క్ ఆచరించడం చేస్తున్నాయి. భవిష్యత్తులో కోవిడ్ కేసులు పెరిగితే వర్క్ ఫ్రం హోం మరోసారి పాటించే అవకాశాలున్నాయి.


కోవిడ్ పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ప్రజలు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం వెల్లడించింది. లాక్‌డౌన్, కర్ఫ్యూ విధించే అవకాశాలు చాలా తక్కువే ఉన్నాయని తెలిపింది. అయితే జాగ్రత్త చర్యలు మాత్రం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. 


Also read: Corona BF.7 Variant: భయపెడుతున్న బీఎఫ్‌ 7 వేరియంట్.. ఫోర్త్ డోస్ తీసుకోవాల్సిందేనా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook