Omicron Variant: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్  ప్రపంచాన్ని భయపెడుతోంది. ఒమిక్రాన్ బారిన పడుతున్న దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో సూపర్‌మైల్డ్ వేరియంట్‌గా ఒమిక్రాన్..యువతను టార్గెట్ చేస్తుందనే నిపుణుల హెచ్చరిక ఆందోళన కల్గిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే 46 దేశాల్లో విస్తరించిన కొత్త వేరియంట్ ఇండియాలో చాపకిందనీరులా విస్తరిస్తోంది. ఒమిక్రాన్ సంక్రమణ డెల్టా వేరియంట్ కంటే ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.స్పైక్ ప్రోటీన్‌లో(Spike Protein)30 కంటే ఎక్కువ మ్యూటేషన్లు ఉండటంతో ఆందోళన అధికమైంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌లో 50 కంటే ఎక్కువ మ్యూటేషన్లు ఉండటంతో ఆందోళన ఎక్కువైంది. ఇప్పటివరకూ వెలుగు చూసిన కరోనా వేరియంట్ల కంటే అత్యంత వేగంగా వ్యాపిస్తున్న వేరియంట్ ఇదే. అందుకే సూపర్‌మైల్డ్ వేరియంట్‌గా చెబుతున్నారు. అయితే లక్షణాలు మాత్రం స్వల్పంగానే ఉంటాయి.


దక్షిణాఫ్రికా, యూరప్ దేశాల్లో ఎక్కువ మంది ఒమిక్రాన్ బాథితులున్నారు. రెండు వ్యాక్సిన్లు తీసుకున్నవారికి కూడా ఒమిక్రాన్(Omicron Variant)సోకింది. ముఖ్యంగా యువకుల్ని ఒమిక్రాన్ టార్గెట్ చేస్తుందనే విషయమే ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది. ఒమిక్రాన్ రూపంలో ఇండియాలో కరోనా థర్డ్‌వేవ్ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఐఐటీ కాన్పూర్ ప్రకారం ఒమిక్రాన్ వేరియంట్ ఇండియాలో 2022 ఫిబ్రవరి నుంచి ప్రారంభం కావచ్చని అంచనా. ఆ సమయంలో గరిష్టంగా 1.5 లక్షల కోవిడ్ కేసులు నమోదు కావచ్చు.సెకండ్ వేవ్ సమయంలో రోజుకు 4 లక్షల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. తేలికపాటి లక్షణాలు, తక్కువ మరణాలున్నందున ఒమిక్రాన్‌ను సూపర్‌మైల్డ్‌గా(Super mild)సూచిస్తారు. ఒమిక్రాన్ తేలికపాటి రూపాంతరం అంటే జలుబుగా వ్యాప్తి చెందగల సామర్ధ్యం ఉంటుంది. రోగ నిరోధక శక్తి ఉన్న వ్యక్తులకు కూడా ఒమిక్రాన్ సోకుతున్న పరిస్థితులున్నాయి. ఇదే ఇప్పుడు ఆందోళనకు కారణమవుతోంది. 


Also read: Omicron cases in India: మహారాష్ట్రలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook