Dog Bite CCTV Footage: నాలుగేళ్ల బాలికపై వీధి శునకాల దాడి.. చిన్నారికి తీవ్ర గాయాలు
Dog Bite CCTV Footage: మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో భయంకరమైన ఘటన జరిగింది. నాలుగేళ్ల బాలికపై కొన్ని వీధి కుక్కులు భయంకరంగా తీవ్రంగా దాడి చేశాయి. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Dog Bite CCTV Footage: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఓ భయానక ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలికపై వీధి కుక్కలు గుంపుగా వచ్చి దాడి చేశాయి. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడింది. సీసీ టీవీలో రికార్డైన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఏం జరిగిందంటే?
నూతన సంవత్సరం వేళ మధ్యప్రదేశ్ లోని భోపాల్‌లో వీధి కుక్కలు విరుచుకుపడ్డాయి. స్థానికంగా అంజలీ నగర్ కాలనీలో ఐదుకుక్కలు ఓ బాలికపై ఎగబడ్డాయి. ఆ చిన్నారిని కిందపడేసి కరిచాయి. దాంతో భయాందోళనలతో ఆ చిన్నారి గట్టిగా ఏడ్వసాగింది. వీధి కుక్కల దాడిలో ఆ బాలిక తీవ్రంగా గాయపడిందని స్థానికులు చెబుతున్నారు.
అంతలోనే అటుగా వచ్చిన ఓ యువకుడు వాటిని తరిమివేయగా.. ఆ బాలికకు ప్రాణాపాయం తప్పింది. అయితే వీధికుక్కల బెడద ఎక్కువైపోయిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. సీసీటీవీ కెమెరాలో నమోదైన ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి.
Also Read: West Bengal Lockdown: పశ్చిమ్ బెంగాల్లో స్కూళ్లు, సినిమా హాళ్లు బంద్- మళ్లీ లాక్డౌన్?
Also Read: Omicron Symptoms: ఒమిక్రాన్ సోకిన వారిలో కొత్త లక్షణాలు.. కళ్లు ఎర్రగా మారడం, జుట్టు రాలడం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి