చెన్నైలో కుప్పకూలిన భవనం.. ఒకరు మృతి
శనివారం సాయంత్రం చెన్నైలోని కందన్‌చావడిలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది.
శనివారం సాయంత్రం చెన్నైలోని కందన్‌చావడిలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. అపార్ట్‌మెంట్ శిథిలాల కింద ఉన్నవారిని బయటకి తీశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ఘటనలో ఒకరు చనిపోయినట్లు, ఐదుగురి తలకు గాయాలైనట్లు, గాయాలైన 17 మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ పి.పొన్నయ్య తెలిపారు. శిధిలాల కింద ఉన్న 23 మందిని రక్షించినట్లు ఆయన తెలిపారు. మొత్తం 61 మంది సిబ్బంది ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ వినోజ్ తెలిపారు.