Onion Prices Today: ఉల్లి ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 40 శాతం ఎగుమతి సుంకం విధింపు
Export Duty on Onion Prices: ఇటీవల టమాట ధరలు చుక్కలు చూపించిన నేపథ్యంలో ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం ముందే మేల్కొంది. ఉల్లి సరఫరా పెంచేందుకు ఎగుమతులపై 40 శాతం సుంకం విధించింది. పూర్తి వివరాలు ఇలా..
Export Duty on Onion Prices: దేశీయ మార్కెట్‌లో ధరల పెరుగుదలను అరికట్టడానికి.. సరఫరాను మెరుగుపరచడానికి ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం 40 శాతం సుంకం విధించగా... ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు ఉల్లిపాయలపై 40 శాతం ఎగుమతి సుంకం వర్తించనుంది. ఇటీవల టమాటా ధరలు ఒకేసారి భారీగా పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉల్లిగడ్డల విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. సెప్టెంబరులో ఉల్లి ధరలు పెరిగే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఎగుమతి సుంకం విధించింది. ఎక్స్‌పోర్ట్ ట్యాక్స్ పెంపుతో దేశంలో ఉల్లి సరఫరా పెరిగితే.. ధరలు అదుపులో ఉంటాయని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. కేంద్ర నిర్ణయంతో సామాన్యులకు ఊరట కలగనుంది.
ఈ నెల 11 నుంచి కేంద్ర ప్రభుత్వం బఫర్ స్టాక్ నుంచి కూరగాయలను విడుదల చేయడం ప్రారంభించింది. 2023-24 సీజన్‌లో 3 లక్షల టన్నుల ఉల్లిపాయలను బఫర్ స్టాక్‌గా ఉంచాలని కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. 2022-23లో ప్రభుత్వం 2.51 లక్షల టన్నుల ఉల్లిని బఫర్ స్టాక్‌గా ఉంచింది. లీన్ సప్లై సీజన్‌లో రేట్లు గణనీయంగా పెరిగినట్లయితే.. అవసరాలను తీర్చడానికి, ధరల స్థిరీకరణ కోసం బఫర్ స్టాక్ నిర్వహిస్తోంది. ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ ఏజెన్సీలు, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFED), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF) మేనేజింగ్ డైరెక్టర్లతో జరిగిన సమావేశంలో ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ విధివిధానాలను ఖరారు చేశారు.
“రిటైల్ ధరలు ఆల్ ఇండియా సగటు కంటే ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు లేదా ప్రాంతాలలోని కీలక మార్కెట్‌లను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉల్లి నిల్వలను విడుదల చేయాలని నిర్ణయించారు. గత నెలలో ధరల పెరుగుదల రేట్లు థ్రెషోల్డ్ స్థాయి కంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ-వేలం, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో రిటైల్ విక్రయాల ద్వారా ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాం..” అని ఆహార మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.
Also Read: Ketika Sharma: పొట్టి నిక్కర్‌లో బ్రో బ్యూటీ సందడి.. కేతిక శర్మ ఖతర్నాక్ పోజులు చూశారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook