Update on National Pension System: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాత పెన్షన్ విధానంపై చర్చ జరుగుతోంది. ఓల్డ్ పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల పెన్షన్ విధానాన్ని సమీక్షించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్‌ నేతృత్వంలోని కమిటీ.. పెన్షన్ విధానంపై అధ్యయనం చేయనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)లో మార్పులు చేర్పులతో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఈ నివేదిక ఆధారంగా ఓపీఎస్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీజేపీయేతర పాలిన రాష్ట్రాల్లో ఓపీఎస్ విధానం అమలు చేస్తుండడంతో కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరిగింది. ఐదు రాష్ట్ర ప్రభుత్వాలు ఓపీఎస్ అమలు చేస్తున్నాయి. మొదట రాజస్థాన్ ప్రభుత్వం మొదట అమలు చేయగా.. ఆ తరువాత పంజాబ్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ ప్రభుత్వాలు కూడా ఓపీఎస్ అమలు చేస్తున్నట్లు ప్రకటించాయి.


కొత్త పెన్షన్ స్కీమ్‌లో గ్యారెంటీడ్ రిటర్న్‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖ సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. కొత్త పెన్షన్ స్కీమ్‌లోనే ఉద్యోగులకు ఎక్కువ ప్రయోజనాలు కలిగించే విధంగా పాత పెన్షన్‌ను పొందేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీంతో పాటు ప్రభుత్వం తన సహకారాన్ని 14 శాతానికి పైగా పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండానే కంట్రిబ్యూషన్ ఎలా పెంచాలనే విధానంపై అధ్యయనం చేస్తోంది. 


పాత పెనన్ష్ విధానంలో అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే.. చివరగా డ్రా చేసిన జీతం ఆధారంగా పెన్షన్ లభిస్తుంది. ద్రవ్యోల్బణం రేటు పెరిగితే.. డీఆర్ కూడా పెరుగుతుంది. ప్రభుత్వం కొత్త పే కమిషన్‌ను అమలు చేస్తే.. పెన్షన్ డబ్బులు కూడా పెరుగుతాయి. అందుకే పాత పెన్షన్ విధానమే కావాలంటూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 


Also Read: CSK vs RR: జోస్ బట్లర్ మరో హాఫ్ సెంచరీ.. చెన్నైకు టార్గెట్ ఎంతంటే..?  


కొత్త పెన్షన్ విధానంతో సమస్య ఇదే..


ఓపీఎస్‌ విధానంలో రిటైర్మెంట్ సమయంలో ఉద్యోగులు పెన్షన్‌గా సగం జీతం పొందుతారు. కొత్త పెన్షన్ స్కీమ్‌ కింద ఉద్యోగి బేసిక్ శాలరీ 10 శాతం +డీఏ మినహాయిస్తారు. పాత పెన్షన్ స్కీమ్‌లోని ఉద్యోగుల జీతం నుంచి డబ్బు తీసివేయరు. అంతేకాకుండా కొత్త పింఛనులో 6 నెలల తర్వాత డీఎ పొందాలనే నిబంధన లేదు. ఇది కాకుండా పాత పెన్షన్ చెల్లింపు ప్రభుత్వ ఖజానాపై ఎక్కువ భారం పడుతుంది. అదే సమయంలో కొత్త పెన్షన్‌లో స్టాండర్డ్ పెన్షన్‌కు హామీ లేదు. ఈ కారణాలతో తమకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుతున్నారు.


Also Read: Interstate Gang: వాట్ ఏ ప్లానింగ్.. జులాయి మూవీ సీన్ రిపీట్.. తీగ లాగితే డొంకంతా బయటపడింది..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook