ఇటీవలే జరిగిన ఉపఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్‌లోని కైరానా లోక్‌సభ, నూపూర్ అసెంబ్లీ స్థానాలకు బీజేపీ కోల్పోవడంపై ఆ రాష్ట్ర మంత్రి లక్ష్మీ నారాయణ్ చౌదరి ఆసక్తికర కారణం చెప్పారు. బీజేపీకి నమ్మకంగా ఉండే చాలా మంది ఓటర్లు వేసవి సెలవులపై వెళ్లడంతోనే ఈ రెండు చోట్లా ఓడిపోయామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ పనితీరుకు ఉపఎన్నికల ఫలితాలు ఎంతమాత్రం గీటురాయి కాదన్న ఆయన.. సాధారణ ఎన్నికల్లో బీజేపీదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'సాధారణ ఎన్నికలతో ఉపఎన్నికలను పోల్చకూడదు. ప్రభుత్వ పనితీరుకు ఉపఎన్నికల ఫలితాలు ఎంతమాత్రం గీటురాయి కావు. వచ్చే ఎన్నికల్లో  అత్యధిక సంఖ్యలో ఓటర్లు పాల్గొంటారు. మా మద్దతుదారులు, ఓటర్లంతా వేసవి సెలవులు కావడంతో పిల్లలతో కలిసి వెళ్లిపోయారు. దీంతో మేము కైరానా, నూపుర్ సీట్లు కోల్పోవలసి వచ్చింది' అని మంత్రి లక్ష్మీనారాయణ్ తెలిపారు.


కైరానా లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్‌పీ బలపరిచిన ఆర్‌ఎల్‌డీ అభ్యర్థి తబస్సుం హస్సన్ విజయం సాధించగా, నూపూర్ అసెంబ్లీ స్థానంలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి నయీమ్ ఉల్ హస్సన్ విజయం సాధించారు.