Assam Airport Incident: దేశంలో ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే..అసోంలోని సిల్చార్ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి భారీ ఎత్తున ప్రయాణీకులు పరారయ్యారు. ప్రయాణీకుల్ని గుర్తించేపనిలో పడ్డారు అధికారులు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) దేశమంతా ప్రకంపనలు రేపుతోంది. రోజురోజుకూ కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.పెరుగుతున్న కరోనా కేసులతో ప్రజలు అల్లాడుతున్న వేళ అసోంలో జరిగిన సంఘటన ఆందోళన రేపుతోంది. అసోంలోని సిల్చార్ విమానాశ్రయంలో (Silchar Airport) జరిగిన ఈ షాకింగ్ ఘటన వివరాలిలా ఉన్నాయి. అసోంలోని సిల్చార్ ఎయిర్ పోర్ట్‌కు ఏప్రిల్ 21 మొత్తం ఆరు విమానాలు చేరుకున్నాయి. ఇందులో మొత్తం 690 మంది ప్రయాణీకులు రాగా..189 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు ( Covid19 Tests) చేయించుకున్నారు. వీరిలో ఆరుగురికి కరోనా సోకినట్టు తేలింది. మరి కొందరు రాష్ట్రంలోని గౌహతి నుంచి వచ్చినవారు కావడం, ఇంకొందరు ఇతర ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లేవారు కావడంతో 2 వందల మంది ప్రయాణీకులకు పరీక్షలు అవసరం లేదని విమానాశ్రయ అధికారులు తెలిపారు. అయితే ఈ క్రమంలో మరో 3 వందల మంది ప్రయాణీకులు పరీక్షలు చేయించుకోకుండా విమానాశ్రయ సిబ్బంది కళ్లుగప్పి తప్పించుకున్నారు. ప్రయాణీకుల వివరాల్ని బట్టి వారిని త్వరలోనే గుర్తిస్తామంటున్నారు. 


కరోనా ఉధృతి నేపధ్యంలో అసోం ప్రభుత్వం ( Assam Government) గతంలోని నిబంధనల్ని పాక్షికంగా సవరించింది. కోవిడ్ పరీక్ష ఫలితం ప్రతికూలంగా వచ్చినప్పటికీ విమానాలు, రైళ్లు ద్వారా అసోంకు వచ్చేవారికి 7 రోజుల గృహ నిర్బంధం తప్పనిసరి చేసింది. ఇప్పుడు సిల్చార్ విమానాశ్రయం నుంచి తప్పించుకున్న ప్రయాణీకుల్ని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు.


Also read: UPSE IES/ISS Notification 2021: నిరుద్యోగులకు శుభవార్త, కేంద్ర ఆర్ధికశాఖలో ఉన్నతోద్యోగాల భర్తీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook