న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత పి చిదంబరంను విచారణ నిమిత్తం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో అక్టోబర్ 24 వరకు చిదంబరం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కష్టడీలో ఉండనున్నారు. ఈడి కస్టడీలో ఉన్నంత కాలం పాటు తనకు వెస్టెర్న్ టాయిలెట్, ఇంట్లో వండిన ఆహారం, మెడిసిన్ సౌకర్యాలు కల్పించేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ దాఖలైన దరఖాస్తును కోర్టు అనుమతించింది.


చిదంబరం కోరుకున్నట్టుగానే ఆయనకు సదుపాయాలు కల్పించేందుకు అనుమతిస్తూ స్పెషల్ జడ్జి అజయ్ కుమార్ కుహర్ ఆదేశాలు జారీచేశారు.