డైరెక్టర్ సంజయ్‌ లీలా భన్సాలీ చారిత్రిక నేపథ్యంలో  తెరకెక్కిస్తున్న చిత్రం 'పద్మావతి' . ఈ  సినిమాపై వివాదాలు కొత్తేమీ కాదు. సినిమా ప్రారంభం నంచి ఇప్పటివరకూ వివాదాలు చుట్టుముట్టుతూనే ఉన్నాయి. అనూహ్యంగా ఈ సినిమాలో చరిత్రను వక్రీకరించారని ఉదయ్‌పూర్ మేవార్‌ రాజవంశస్థులు ఆరోపించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమ రాజపుత్రలు చరిత్రలను వక్రీకరించారని.. ఈ సినిమా విడుదలను ఆపేయాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిమ్‌ సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్‌సీ) చీఫ్ ప్రసూన్‌ జోషి, ఇతరులకు ఉదయ్‌పూర్ మేవార్‌ రాజవంశస్థుడు ఎంకే విశ్వరాజ్‌ సింగ్‌ లేఖ రాశారు. వారితో పాటు సమాచార ప్రసారశాఖ మంత్రి స్మృతి ఇరానీ, మానవ వనరులు అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా, పోలీస్ ఉన్నతాధికారులకు కూడా లేఖ రాశారు.


లేఖలో ఏముంది ? 


 పద్మావతి సినిమాలో రాజపుత్రలు చరిత్రను వక్రీకరించారు. హిందువుల చరిత్ర, సాంప్రదాయం, భారతదేశ చరిత్ర, సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. రాణి పద్మావతి చరిత్ర గురించి పూర్తిగా పరిశోధన చేసి చిత్రాన్ని తెరకెక్కిస్తున్న అని భన్సాలీ చెప్తున్న మాటల్లో వాస్తవం లేదు. రాణి పద్మావతి గురించి డైరెక్టర్ భన్సాలీ.. నన్ను కానీ, మా రాజపుత్రులను కానీ సంప్రదించలేదు. చరిత్రను వక్రీకరించే ఇటువంటి చిత్రాలతో దేశానికి ప్రమాదం" అని ఎంకే విశ్వరాజ్‌ సింగ్‌  లేఖలో పేర్కొన్నారు.