సొంత బలంతో గెలవాలని మోదీకి పాకిస్థాన్ సూచన
గుజరాత్ ఎన్నికల్లో భారత్ మమ్మల్ని లాగడాన్ని మానుకోవాలి. మోదీ సొంత బలంతో గెలిచేందుకు ప్రయత్నించాలి: పాకిస్థాన్
అహ్మాద్ పటేల్ ను గుజరాత్ సీఎంగా చూడాలని పాక్ కోరుకుంటోందని ఎన్నికల ప్రచారంలో మోడీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై పాక్ విదేశాంగశాఖ ఘాటుగా స్పందించింది.'గుజరాత్ ఎన్నికల్లో పాకిస్థాన్ గురించి ప్రస్తావించడం మానుకోవాలని సూచించింది. భారత ప్రధాని ..తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని.. ఇది ఏమాత్రం సమంజసం కాదని ట్విట్టర్ లో పేర్కొంది. దమ్ముంటే గుజరాత్ లో ప్రధాని మోదీ తన సొంత బలంతో గెలవాలని సవాల్ విసిరింది. కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్ ప్రభుత్వంతో చర్చలు జరిపిందని ఇటీవలే మోదీ విమర్శించిన సంగతి తెలిసిందే..! తాజాగా గుజరాత్ ఎన్నికలకు పాక్ తో ముడిపెట్టడం వంటి ఆరోపణలతో పాక్ ఈ విధంగా స్పందించింది. కాగా పాక్ స్పందనతో ఇది చర్చనీయంశంగా మారింది