తమిళనాడు ఆర్కే నగర్ బైపోల్ కౌంటింగ్ దాదాపు పూర్తికావొస్తుంది. అన్నాడీఎంకే బహిష్కృత నేత దినకరన్ ముందంజలో ఉన్నారు. ఈ నేపథ్యంలో దినకరన్ మదురై ఎయిర్ పోర్ట్ లో మీడియాతో మాట్లాడారు. తనకు మద్దతుగా నిలిచినా ఆర్కే నగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న మూడు నెలల్లో అధికార పార్టీ హోదాను అన్నాడీఎంకే పార్టీ కోల్పోతుందని అన్నారు. నిజమైన అమ్మవారసులం తామేనని.. పార్టీ గుర్తు.. పార్టీ పేరు ఇక్కడ విషయం కాదన్నారు. ఆయన మదురై నుండి చెన్నైకు వెళ్లి అమ్మ సమాధి వద్ద నివాళులు అర్పించారు.


స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగిన టిటివి దినకరన్ కు  ప్రస్తుతం 54,102 ఓట్లు పోలయ్యాయి. అన్నాడీఎంకే  అభ్యర్థి ఇ.మధుసూదనన్ కు 27, 778 ఓట్లు, డీఎంకే అభ్యర్థి ఎన్.మరుతు గణేష్ కు 14,363 ఓట్లు వచ్చాయి.