నా భర్త కోసమే ఈ అభ్యర్థన: శశికళ
చెన్నై: "నా భర్త తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందుకోసం నాకు 15 రోజుల పెరోల్ జారీ చేయండి" అని మాజీ అన్నా డీఎంకే పార్టీ కార్యదర్శి శశికళా నటరాజన్ కోర్టుకు నివేదించుకున్నారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ నిమిత్తం చేరిన శశికళ భర్త నటరాజన్‌కు కాలేయమే కాదు.. శరీరంలోని చాలా అవయవాలు పనిచేయడం లేదని.. తన భార్యను చూడాలని అతను కోరడంతో శశికళకు మానవతా కోణంలో ఆలోచించి పెరోల్ జారీ చేయాలని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు నివేదించారు.ఈ విషయాన్ని శశికళ మేనల్లుడు టిటివి దినకరన్ మీడియాకు వెళ్లడించారు. శశికళ గత ఫిబ్రవరి నుంచీ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులోఉన్న విషయం విదితమే. ఒకప్పుడు పబ్లిక్ పీఆర్వోగా తమిళనాడులో పనిచేసిన నటరాజన్‌ను 33 ఏళ్ల కిందట వివాహం చేసుకుంది శశికళ. ఆయన ద్వారానే శశికళ.. జయలలితకు పరిచయమైంది.