కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వ్యవహరిస్తున్న మహిళ నేత ప్రియంక చతుర్వేది ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ పార్టీకి సంబంధించిన ప్రాధమిక సభ్యత్వంతో పాటు అన్ని పదువులకు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణతో పనిచేసినవారికి గుర్తింపు లేదనీ ...అందుకే రాజీనామా చేస్తున్నానని  ప్రియాంకా చతుర్వేది వివరణ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా నిరక్షరాస్యులైన గూండాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ట్విట్టర్ వేదికగా తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అసుల ఏం జరిగిందంటే...


ఇటీవలె ఆమె యూపీలోని మధురలో పర్యటించారు. ఈ సందర్భంగా కొందరు స్థానిక నేతలు తనతో అసభ్యంగా ప్రవర్తించారట. ఈ విషయాన్ని హైకమాండ్ కు ఫిర్యాదు చేయగా ఆ వ్యక్తులను పార్టీ నుంచి సర్పెండ్ చేశారు. యూపీ వెస్ట్ ప్రాంతానికి ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పార్టీ జనరల్ సెక్రటరీ జ్యోతిరాధిత్య సింధియా జోక్యంతో వాళ్లను పార్టీలోకి మళ్లీ పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ పరిణామంపై ఆగ్రహించిన  ప్రియాంక చతుర్వేది ఈ మేరకు పార్టీకి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది.