మధ్యప్రదేశ్‌లో శనివారం ఆర్థరాత్రి సమయంలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కట్ని-చోపన్ మధ్య ప్రయాణిస్తున్న ప్యాసింజర్ రైలుకు సంబంధించిన ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. కట్ని జిల్లాలోని సల్హన-పిపరియకల రైల్వే స్టేషన్ల మధ్య ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అర్థరాత్రి వేళ ఈ ప్రమాదం జరిగినట్టుగా ఏఎన్ఐ పేర్కొంది. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి సమాచారం అందాల్సి వుంది. ఒకదాని తర్వాత మరొకటిగా తరచుగా చోటుచేసుకుంటోన్న రైలు ప్రమాదాలు రైలు ప్రయాణికులకు ఆందోళన కలిగిస్తున్నాయి. భారతీయ రైల్వేలోని భద్రతా లోపాలను తరచుగా చోటుచేసుకుంటున్న దుర్ఘటనలు ఎప్పటికప్పుడు వేలెత్తి చూపిస్తూనే వున్నా.. ప్రభుత్వం, సంబంధిత అధికార యంత్రాంగం మాత్రం పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవడం లేదనే విమర్శలూ వినిపిస్తున్నాయి.