విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ.. ఆస్పత్రికి తరలించేలోపే ప్రయాణికుడి మృతి!
బ్యాంకాక్ నుంచి శుక్రవారం ఉదయం ఢిల్లీ వస్తున్న స్పైట్ జెట్ ఎస్‌జీ 88 విమానంలో విషాదం చోటుచేసుకుంది. విమానంలో ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురవడంతో స్పైస్ జెట్ సిబ్బంది వెంటనే విమానాన్ని వారణాసికి మళ్లించి వారణాసి విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానం కిందకు దిగిన అనంతరం అస్వస్థతకు గురైన ప్రయాణికుడిని స్పైస్ జెట్ సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే అతడు మృతిచెందాడని ఆస్పత్రిలో అతడిని పరీక్షించిన వైద్యులు చెప్పారని స్పైస్ జెట్ పేర్కొన్నట్టుగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించింది.