ఓ దేశ పౌరుడిగా గుర్తించే ప్రధానమైన డాక్యుమెంట్ పాస్‌పోర్ట్. ఇదుంటేనే విదేశీయాత్ర సాధ్యమౌతుంది. చాలా సందర్భాల్లో పాస్‌పోర్ట్‌లో వివరాలు సరిగ్గా పొందుపర్చకపోతే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. అందుకే పాస్‌పోర్ట్ చేయించుకునేటప్పుడు ఏ విధమైన తప్పులు లేకుండా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాస్‌పోర్ట్ వినియోగం అనేది ఇతర దేశాలకు వెళ్లేటప్పుడే ఉంటుంది. ఆ దేశంలో మీ గుర్తింపును నిర్ధారించేది అదే. ఈ క్రమంలో పాస్‌పోర్ట్ చేయించేటప్పుడు పేరులో ఏ విధమైన స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి. పాస్‌పోర్ట్ ఎప్పుడు చేయించినా ఈ విషయం గుర్తుంచుకోవాలి. పేరు స్పెల్లింగ్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి.


చాలాసార్లు మీకు సంబంధించిన వేర్వేరు డాక్యుమెంట్లలో పేరు లేదా స్పెల్లింగ్ వేర్వేరుగా ఉంటుంది. కొన్ని డాక్యుమెంట్లలో ఇంటి పేరు రాసి ఉంటుంది. కొన్నింటిలో ఇంటి పేరు ఉండదు. దీనివల్ల ఇబ్బందులు ఎదురౌతుంటాయి. స్పెల్లింగ్‌లో ఒక అక్షరం తప్పున్నా సరే చాలా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. 


పేరు స్పెల్లింగ్ తప్పుంటే దాని ప్రభావం వీసా లేదా టికెట్‌పై పడుతుంది. అందుకే ఎప్పుడూ పాస్‌పోర్ట్‌తో పాటు సపోర్టెడ్ డాక్యుమెంట్లలో పేరు స్పెల్లింగ్ సరిగ్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ స్పెల్లింగ్ తప్పులుంటే వెంటనే సరిచేసుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. 


Also read: IRCTC Thailand Tour: ఐఆర్‌సీటీసీ నుంచి థాయ్‌లాండ్ టూర్ ప్యాకేజ్, 5 రాత్రులు, 6 రోజుల యాత్ర వివరాలు ఇలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook