సోమవారం కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నాయకుడు కమల్‌నాథ్‌ తనను కలిసిన విలేకర్లతో మాట్లాడుతూ,  భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పేరును బలత్కర్ జనతా పార్టీగా మార్చాలని అన్నారు. కథువా, ఉన్నావ్ అత్యాచారం కేసులపై మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, నేను బీజేపీలోని 20 మంది నేతలు అత్యాచార కేసులతో సంబంధం ఉన్నట్లు ఎక్కడో చదివానని.. అది భారతీయ జనతా పార్టీ కాదని, బలాత్కార్‌ జనతా పార్టీ అని ఆయన విమర్శించారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని  కమల్‌నాథ్‌ కోరారు.


ఇటీవలే ఉన్నావ్ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్, గతేడాది ఓ మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు రావడంతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అరెస్టు చేసింది. గత గురువారం, ఈ బీజేపీ ఎమ్మెల్యేపై భారత శిక్షా కోడ్ (IPC) మరియు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టం ప్రకారం సెక్షన్ 363 (కిడ్నాప్), 366 (మహిళ యొక్క అపహరణ), 376 (అత్యాచారం), 506 (క్రిమినల్ బెదిరింపు) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.