దేశవ్యాప్తంగా స్వల్ప మోతాదులో తగ్గుముఖం పడుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు
దేశవ్యాప్తంగా తగ్గుముఖం పడుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్ప మోతాదులో తగ్గుముఖం పడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ నుంచి మొదలుకుని ఈ ఏడాదిలో అత్యధిక ధరలతో ఇబ్బందులు ఎదుర్కున్న ముంబై వరకు పలు మెట్రో నగరాల్లో ఆదివారం ధరల్లో స్వల్పమొత్తంలో తగ్గుదల నమోదైంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధరలు 20 పైసలు తగ్గి రూ. 76.71కు చేరుకోగా, లీటర్ డీజిల్ ధర 18 పైసలు తగ్గి రూ.71.56కు చేరుకుంది. ఇక ముంబైలో ఇంధనం ధరల విషయానికొస్తే, లీటర్ పెట్రోల్ ధర 20 పైసలు తగ్గి రూ. 82.23కు చేరుకోగా లీటర్ డీజిల్ 19 పైసలు తగ్గి రూ.74.97కు చేరుకుంది. నేడు హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 81.33 కాగా లీటర్ డీజిల్ ధర రూ.77.86 వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గడం ఇందుకు ఓ కారణమైతే, డాలర్ విలువతో పోల్చుకుంటే, ప్రస్తుతం రూపాయి కొంతమేరకు బలపడుతుండటం మరో కారణంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.