న్యూఢిల్లీ: పెట్రోల్ ధరలు ( Petrol prices ) జూన్‌ 7వ తేదీ నుంచి ఏ రోజుకు ఆరోజు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ( Fuel prices) వాహనదారులు గగ్గోలు పెడుతుండగా..  వరుసగా 16వ రోజైన ఇవాళ కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్‌ ధర 33 పైసలు పెరగ్గా, డీజిల్ ధర లీటర్‌కి 58 పైసల చొప్పున పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.79.56కు, డీజిల్‌ ధర రూ.78.85కు చేరాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.86.36 కాగా డీజిల్‌ ధర రూ.77.24 కి చేరింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్‌ ధర రూ.81.27, డీజిల్‌ రూ.74.14కు పెరిగాయి. మొత్తం గత 16 రోజులలో ఇప్పటివరకు పెట్రోల్‌ ధర లీటర్‌‌కి రూ.8.30, డీజిల్‌ ధర రూ.9.22పైసలు పెరిగాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

( Read also : తెలంగాణ టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి )


హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 82.25 గా ఉండగా, డీజిల్ ధర రూ. 77.06 వద్ద కొనసాగుతోంది ( Fuel prices in Delhi ). జూన్ 7వ తేదీకి ముందు లాక్‌డౌన్ కారణంగా 82 రోజుల పాటు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..