Petrol, diesel and LPG prices latest updates| న్యూఢిల్లీ: వాహనదారులకు, సామాన్యులకు గుడ్ న్యూస్. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు ఇటీవల కాలంలో భారీగా పెరిగిన ఎల్పీజీ ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టనున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు తగ్గుముఖం పట్టాయని, రానున్న రోజుల్లో మరింత తగ్గనున్నాయని ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించినట్టుగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గిన ప్రతీసారి వాటి ఫలాలు కింది స్థాయిలో ఉన్న సామాన్యుల వరకు చేరేలా చర్యలు తీసుకుంటామని గతంలోనే ప్రకటించామని, అందులో భాగంగానే ధరలు తగ్గుముఖం పట్టాయని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నట్టు ఏఎన్ఐ తెలిపింది. 


ఎల్పీజీ సిలిండర్ల ధరల విషయానికొస్తే.. ఫిబ్రవరి 4 నుంచి మార్చి 1 నాటికే నెల రోజుల వ్యవధిలోనే ఒక ఎల్పీజీ సిలిండర్‌పై నాలుగు ధఫాల్లో మొత్తం రూ. 125 మేర పెరిగింది. ఆ తర్వాత తొలిసారిగా ఏప్రిల్ 1నే రూ. 10 మేర తగ్గింది. ఎల్పీజీ ధరలు (LPG prices) 10 రూపాయల మేర తగ్గిన తర్వాత నాలుగు రోజులకే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ ప్రకటన చేశారు. అదేవిధంగా ఇటీవలే లీటర్ పెట్రోల్‌పై 22 పైసలు, లీటర్ డీజిల్‌పై 23 పైసలు చొప్పున ధరలు తగ్గాయి. 


Also read : Home loans interest rates: హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు పెంచిన SBI.. హోమ్ లోన్స్ భారం పెరగనుందా ?


పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సిలిండర్ ధరలు (Petrol prices, diesel prices, LPG prices)  పెరుగుతుండటంపై ఆందోళనకు గురవుతున్న వాహనదారులు, సామాన్యులకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన ప్రకటన కొంత ఊరటనిచ్చినప్పటికీ.. ధరలు ఇంకా తగ్గినప్పుడే వారికి అసలైన ఊరట లభించనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook