పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్‌పై 31 పైసలు పెరిగి రూ.79.15గా ఉంది. డీజిల్ లీటర్‌పై 39 పైసలు పెరిగి రూ.71.15గా ఉంది. దేశ రాజధాని ముంబైలో పెట్రోల్ ధర జీవితకాల గరిష్టానికి చేరుకుంది. నేటి ఉదయం సవరించిన ధరల ప్రకారం, ముంబైలో పెట్రోల్ 31 పైసలు పెరిగి రూ.86.56/లీటర్‌గా, డీజిల్‌పై 44 పైసలు పెరిగి రూ.75.54/లీటర్‌గా ఉంది. దేశంలోని మిగిలిన మెట్రో నగరాలతో పోలిస్తే ముంబైలో పెట్రోల్ ధరలు అధికంగా ఉన్నాయి. చెన్నైలో పెట్రోల్ రూ.82.24/లీటర్‌, డీజిల్ రూ.75.19/లీటర్‌, కోల్‌కతాలో పెట్రోల్ రూ.82.06/లీటర్‌, డీజిల్ రూ.74.00/లీటర్‌గా ఉంది (ధరలు.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్ సైట్ లో పేర్కొన్న ప్రకారం ). అటు నాంధేడ్లో పెట్రోల్ ధర రూ.88.16/లీటర్‌గా, డీజిల్ రూ.75.94/లీటర్‌గా నమోదవగా.. పెరుగుతున్న ధరలపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


అటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరగడంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ రూ.83.92 ఉండగా, డీజిల్‌ రూ.77.39 లుగా ఉంది. విజయవాడలో లీటరు పెట్రోల్‌ రూ.85.09 ఉండగా, డీజిల్‌ రూ.78.26లుగా ఉంది.


ఇంధన ధరలు పెరగడానికి బయటి దేశాలే కారణం


దేశంలో ఇంధన ధరలు రోజురోజుకీ పెరగడానికి బయటిదేశాలే కారణమని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. వెనెజులా, ఇరాన్ లాంటి దేశాలు ఇంధన ధరలను పెంచడంతో పాటు అంతర్జాతీయంగా అన్ని కరెన్సీలు డాలర్ ముందు బలహీనంగా మారడంతో.. మన దేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఇలాంటి పరిస్థితుల నుండి బయటపడటానికి అన్ని విధాలా ప్రయత్నిస్తుందని వెల్లడించారు.