పెట్రోల్ ధరల్లో వరుసగా ఆరో రోజు కూడా పెరుగుదల నమోదు చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర 15 పైసలు పెరగ్గా.. డీజిల్ ధర 5 పైసలు పెరిగింది. నవంబర్ 11 తర్వాత డీజిల్ ధర పెరగడం ఇదే మొదటిసారి కాగా గత 10 రోజుల పెట్రోల్ ధరలను పరిశీలిస్తే.. ఇప్పటివరకు రూపాయికిపైగానే పెట్రోల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడమే అందుకు ఓ కారణంగా మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ధరల పెరుగుదల అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.74.20 పలుకుతుండగా లీటర్ జీజిల్ ధర రూ. 65.84 గా ఉంది. ఇక దేశ వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోల్ ధర రూ. 79.86, డీజిల్ ధర రూ. 69.06 గా ఉండగా బెంగళూరులో పెట్రోల్ ధరలు రూ. 76.74గా డీజిల్ ధర రూ. 68.08 గా ఉన్నాయి. 


ఢిల్లీకి ఆనుకుని వున్న నొయిడాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 75.66గా ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.66.15 గా ఉంది. గురుగ్రామ్‌లో పెట్రోల్ ధర రూ. 73.87గా ఉండగా డీజిల్ ధర రూ. 65.18 గా ఉంది.