పెట్రోలు, డీజిల్ రేట్లు దిగి వచ్చాయి.  ఆరు రోజులుగా తగ్గుతున్న పెట్రో ధరలు.. ఇవాళ కూడా తగ్గుముఖం పట్టాయి. ఐతే ఈ రోజు భారీగా తగ్గడం విశేషం.  మొత్తంగా పెట్రోల్ ధర లీటరుకు 2 రూపాయల 69 పైసలు తగ్గగా.. డీజిల్ లీటరుకు 2 రూపాయల 33 పైసలు తగ్గింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో ఢిల్లీలో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటరుకు 70 రూపాయల 29 పైసలుగా ఉంది. అలాగే డీజిల్ ధర లీటరుకు 63 రూపాయల 01పైసలుగా ఉంది. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ.74.72గా ఉంది. అలాగే లీటర్ డీజిల్ ధర రూ. 68.60గా ఉంది. 


అంతర్జాతీయంగా ఆయిల్ మార్కెట్లలో జరుగుతున్న హెచ్చు తగ్గులే దీనికి కారణంగా తెలుస్తోంది.  ప్రస్తుతం అంతర్జాతీయంగా చమురు మార్కెట్లో సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లుపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దిగి వచ్చిన పెట్రో ధరలు ఇవాళ ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వచ్చాయి.   


పట్టణం        పెట్రోల్ ధర    డీజిల్ ధర  
హైదరాబాద్     74.72             68.60
ఢిల్లీ                 70.29             63.01
కోల్‌కతా           72.98             65.34
ముంబై            75.99             65.97
చెన్నై              73.02             66.48
బెంగుళూరు     72.70             65.16