Petrol Price Today In Hyderabad: భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు, హైదరాబాద్‌లో రికార్డు
Petrol Price Today In Hyderabad On January 27, 2021: దేశ వ్యాప్తంగా వాహనదారుల జేబులు గుల్లవుతున్నాయి. భారత్‌లో చమురు ధరలు రోజురోజుకూ భగ్గుమంటున్నాయి. డీజిల్ ధర మాత్రం దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లోనే అత్యధికంగా నమోదైంది.
Petrol Price Today In Hyderabad On January 27, 2021: భారత్‌లో చమురు ధరలు రోజురోజుకూ భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ మొదలైన సమయం నుంచి వాహనదారుల జేబులకు చిల్లు పడుతుంది. తాజాగా జనవరి 27 (బుధవారం) నాడు లీటర్ పెట్రోల్ ధర 27 పైసలు చొప్పున పెరిగింది. పెరిగిన ధరలతో బుధవారం నాడు ఆల్‌టైమ్ కొత్త గరిష్ఠానికి పెట్రోలు, డీజిల్ ధరలు చేరుకున్నాయి.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.86.30 అయింది. డీజిల్ ధర రూ.76.48కు పెరిగింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకారం.. పెట్రోల్ ధర హైదరాబాద్(Petrol Price In Hyderebad)లో లీటర్‌కు రూ.89.77 అయింది. చెన్నైలో రూ.88.82, కోల్‌కతాలో రూ.87.69, ముంబైలో గరిష్టంగా రూ.92.86కి చేరింది.
Also Read: SBI MF Retirement Benefit Scheme: మ్యూచువల్ ఫండ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ప్రారంభించిన SBI
ఇక డీజిల్ ధర ఢిల్లీ(Fuel Prices In Delhi)లో రూ.76.48కు చేరగా, హైదరాబాద్‌లో రూ.83.46 అయింది. ముంబైలో రూ.83.30, చెన్నైలో రూ.81.71, కోల్‌కతాలో రూ.80.08గా ఉంది. అయితే డీజిల్ ధర మాత్రం దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లోనే అత్యధికంగా ఉంటోంది.
Also Read: WhatsApp: ప్రైవసీ పాలసీ నచ్చలేదా.. మీ వాట్సాప్ అకౌంట్ ఇలా డిలీట్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook