హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరల్లో వరుసగా రెండో రోజు కూడా భారీ తగ్గుదల కనిపించింది. గురువారం నాడు లీటర్ పెట్రోల్ ధర 17 పైసలు, లీటర్ డిజిల్ ధర 19 పైసలు తగ్గగా శుక్రవారం సైతం పెట్రోల్ 22 పైసలు, డీజిల్ 25 పైసలు 25 పైసలు తగ్గింది. ధరల తగ్గుదల అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ 74.43గా ఉండగా డీజిల్ రూ.67.61 గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలోనూ లీటర్ పెట్రోల్ ధర రూ.80.03 గా ఉండగా లీటర్ డీజిల్ ధర 70.88 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.79.14 కాగా లీటర్ డీజిల్ ధరలు 73.72గా ఉన్నాయి. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 76.92 కాగా డీజిల్ ధర 69.86 వద్ద అమ్ముడవుతోంది. ఇక చెన్నైలో ఇంధనం ధరల విషయానికొస్తే.. లీటర్ పెట్రోల్ ధరలు రూ.77.31 కాగా, లీటర్ డీజిల్ ధరలు రూ 71.43గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీని ఆనుకుని ఉన్న గుర్‌గావ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ 74 కాగా డీజిల్ రూ 66.65 వద్ద అమ్ముడవుతోంది.  


జనవరి 12 నుంచి పెట్రోల్, డిజీల్ ధరలు క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పటివరకు గత రెండు వారాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు వేర్వేరుగా మొత్తం రూ.1.50 తగ్గుదల నమోదైంది. ముడి చమురు ధరలు తగ్గుతుండటంతో పాటు డిమాండ్ సైతం తగ్గుతుండటమే ఈ ధరల తగ్గుదలకు కారణమని మార్కెట్ వర్గాలు తెలిపాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..