PF Account: పీఎఫ్ ఖాతాదారుల  కోసమే ఈ అలర్ట్. పీఫ్ కొత్త నిబంధనలు వచ్చేశాయి. ఏప్రిల్ 1, 2022 నుంచి అమలవుతున్నాయి. మీ ఖాతాలో ఆ మేరకు డబ్బుంటే పన్ను చెల్లించాల్సిందే మీరు..ఆ వివరాలేంటో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్యాంకింగ్, ఐటీ, పీఎఫ్ ఇలా వివిధ అంశాలకు సంబంధించి కొత్త నిబంధనలు అమలు కానున్నాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఏయే అంశాల్లో ఏయే మార్పులు జరిగాయో తెలుసుకోకపోతే భారీ జరిమానా తప్పదు. ముఖ్యంగా పీఎఫ్ ఖాతాకు సంబంధించి కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. అంటే ఇక నుంచి పీఎఫ్ ఖాతాలో డబ్బులకు కూడా ట్యాక్స్ పడనుంది. 


పీఎఫ్ కొత్త నిబంధనలు


మీ పీఎఫ్ ఖాతాల్లో 2.25 లక్షల వరకూ జమయ్యే నగదుపై పన్ను విధిస్తోంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిప్రకారం పీఎఫ్ ఖాతాలో ఏడాదిలో 5 లక్షలకు జమ చేస్తే..2 లక్షల 50 వేలకు పన్ను విధించనున్నారు. అదే విధంగా మిగిలిన మొత్తం పన్ను పరిధిలోకి రాకుండా ఉంటుంది. ప్రభుత్వ రంగాల్లో పనిచేసే ఉద్యోగి ప్రోవిడెంట్ ఫండ్ ఏడాదికి 6 లక్షలు జమ చేస్తే...లక్ష రూపాయలు మాత్రమే ట్యాక్స్ పరిధిలో వచ్చే ఆదాయంగా లెక్కిస్తారు. మిగిలిన మొత్తం పన్ను లేకుండా ఉంటుంది. 


రెండుగా పీఎఫ్ ఎక్కౌంట్ల విభజన


ఈ కొత్త నిబంధలు వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి పీఎప్ ఖాతాలు ట్యాక్సెబుల్, నాన్ ట్యాక్సెబుల్ పేర్లతో రెండుగా విడిపోతున్నాయి. 2021 మార్చ్ 31కు క్లోజ్ అయిన ఖాతాలకు కూడా ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం ఏడాది పీఎఫ్ నగదు 2.5 లక్షల కంటే ఎక్కువగా ఉంటే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇక నుంచి 2.5 లక్షల కంటే ఎక్కువ పీఎఫ్ నగదు ఉంటే..రెండు ప్రత్యేకమైన ఎక్కౌంట్లు క్రియేట్ చేసుకోవాలి. 


Also read: PM Ujjwala Yojana: పీఎం ఉజ్వల యోజన స్కీమ్ సూపర్ సక్సెస్... ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకోండి..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.