PM Kisan Samman Nidhi: అన్నదాతలకు శుభవార్త. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పదవ విడత వచ్చేస్తోంది. కిసాన్ సమ్మాన్ నిధి పదవ విడత నిధుల విడుదలపై నెలకొన్న సందేహాలకు తెరపడింది. అన్నదాతల ఖాతాల్లో ఆ డబ్బులు ఎప్పుడు పడనున్నాయంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి (PM Kisan Samman Nidhi)సంబంధించి కీలకమైన ప్రకటన వెలువడింది. వాస్తవానికి లక్షలాదిమంది రైతన్నలు దేశవ్యాప్తంగా పదవ విడత కిసాన్ నిధి డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అధికారిక వెబ్‌సైట్ నుంచి సూచనలు జారీ అయ్యాయి. పీఎం కిసాన్‌లో రిజిస్టరైన అన్నదాతలు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉందని ఆ వెబ్‌సైట్ పేర్కొంది. ఆధార్ సంబంధిత ఓటీపీ ధృవీకరణ కోసం బయోమెట్రిక్ ధృవీకరణ కోసం మీ సమీపంలోని సీఎస్ సీ కేంద్రాల్లో ఈ కేవైసీ చేయించుకోమని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రకటించింది. పీఎం కిసాన్ ఈ కేవైసీ (e Kyc) ప్రక్రియ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు పరిశీలిద్దాం..


ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ సందర్శించాలి. మీ కుడి చేతివైపున హోమ్‌పేజీకు దిగువన ఫార్మర్స్ కార్నర్ ఉంటుంది. ఈ కార్నర్ దగ్గర ఈ కేవైసీని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కేవైసీ ఫెసిలిటేట్ కోసం పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీ ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి..సెర్చ్ బటన్ ప్రెస్ చేయాలి. ఆ తరువాత ఆధార్ కార్డుతో లింక్ అయున్న మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి..ఓటీపీ జనరేట్ చేసుకోవాలి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి..ధృవీకరణ బటన్ ప్రెస్ చేయాలి. అక్కడితో మీ పీఎం కిసాన్ ఈ కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. 


ఈ ప్రక్రియ పూర్తి కాగానే మీ ఖాతాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పదవ విడత డబ్బులు ( Pm kisan samman nidhi 10th installment) పడిపోతాయి. రైతుల ఖాతాల్లో పదవ విడత పీఎం కిసాన్ నిధి డబ్బులు జనవరి 1, 2022న పడనున్నాయని పీఎం  కిసాన్ సమ్మాన్ నిధి అధికారికంగా వెల్లడించింది. 


Also read: SBI CBO Recruitment : ఎస్బీఐ సీబీఓ ఆఫీసర్‌ పోస్టుల దరఖాస్తుకు చివరి తేదీ, అర్హతలు.. ఎంపిక ప్రక్రియ..పూర్తి వివరాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి