PM KISAN Samman nidhi scheme amount: న్యూఢిల్లీ: పీఎం-కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద రైతులకు ఏడాదికి మూడు విడతల్లో కలిపి అందిస్తున్న రూ.6 వేల మొత్తాన్ని రూ.12వేలకు పెంచనున్నట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని కేంద్రం స్పష్టంచేసింది. అలాగే మిగతా మొత్తాన్ని అడ్వాన్స్ రూపంలోనే అందించే ప్రతిపాదన కూడా ఏమీ లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ( Union minister Narendra Singh Tomar ) తేల్చిచెప్పారు. పీఎం-కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు రైతులకు రూ.38,282 కోట్ల నగదును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసినట్టు కేంద్ర మంత్రి మంగళవారం లోక్ సభకు ( Parliament monsoon session ) తెలిపారు. ఈ వివరాలను లోక్ సభకు వెల్లడించే క్రమంలోనే రైతులకు కేంద్రం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని పెంచనున్నట్టు జరుగుతున్న ప్రచారంలోనూ నిజం లేదని కేంద్ర మంత్రి వివరణ ఇచ్చారు. Also read : SBI ATM: ఎస్‌బీఐ ఏటీఎం నుంచి డబ్బు తీస్తున్నారా ? ఈ విషయాలు గుర్తుంచుకోండి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది రైతులకు ఈ ఆర్థిక సాయం అందుతున్న కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లోక్ సభకు తెలిపారు. ఆర్థిక సహాయం పెంపుపై జరుగుతున్న ప్రచారంపై స్పందించాల్సిందిగా ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో పలువురు ఎంపీలు ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో కేంద్రం మంత్రి ఈ వివరణ ఇచ్చారు. Also read : AP: రాష్ట్రంలో మూడ్రోజుల పాటు వర్షాలు, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు


మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR