Farmer Registry: మీ ఎక్కౌంట్‌లో కూడా నేరుగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు జమ కావాలంటే వెంటనే ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే వచ్చే వాయిదా మీ ఎక్కౌంట్లో పడదు. కిసాన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా చేయాలో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రతి నాలుగు నెలలకోసారి కేంద్ర ప్రభుత్వం 2 వేల రూపాయలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది. అంటే ఏడాదికి 6 వేల రూపాయలు అందిస్తోంది. పీఎం కిసాన్ రానున్న వాయిదా డబ్బులు మీ ఎక్కౌంట్‌లో పడాలంటే ముందుగా ఈ నెలలో కిసాన్ రిజిస్ట్రీ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే వచ్చే వాయిదా డబ్బులు పడవు. ఎందుకంటే చ్చే రెండు వాయిదాలు ఆగస్టు, నవంబర్ నెలల్లో పడనున్నాయి. 


కిసాన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఆధార్ కార్డుతో పాటు ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్ అవసరమౌతాయి. ఈ ప్రక్రియ పూర్తయితే ఆ రైతుకు ఒక యూనిక్ నెంబర్ జారీ అవుతుంది. రిజిస్ట్రేషన్ తరువాత కిసాన్ గోల్డెన్ కార్డు ఇష్యూ అవుతుంది. మీ సేవా కేంద్రాల్లో ఎక్కడికైనా వెళ్లి కిసాన్ రిజిస్ట్రీ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ప్రతి రైతుకు ఒక యూనిక్ ఐడీ జారీ అవుతుంది. రైతుకు సంబంధించిన సమాచారమంతా ఉంటుంది. ఒకవేళ రైతు పేరు రిజిస్ట్రేషన్ కాకపోతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 17వ వాయిదా డబ్బులు అందుకోలేడు. 


ఈ ప్రక్రియ ద్వారా ఏ రైతు ఏ పంట పండించాడు. ఎంత మొత్తంలో పండించాడనే వివరాలు రిజిస్టర్ అవుతాయి. తద్వారా అగ్రికల్చర్ సైంటిస్టుల ద్వారా ఏ ఫెర్టిలైజర్ ఎలా వాడాలి, ఎంత నీరు కలపాలి, ఎప్పుడు వేయాలనే వివరాలు తెలుసుకోవచ్చు. 


Also read: Income Tax Saving Tips: ఇలా చేస్తే ఏకంగా 1 లక్షా 80 వేలు ట్యాక్స్ సేవ్ చేయవచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook