PM Kisan Samman Nidhi Yojana 13th Installment: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నిధులు ఎప్పుడు వస్తాయి..? 13వ విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు జమ చేయనుంది..? ఫిబ్రవరి 24న లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతాయని భావించినా.. కేంద్ర ప్రభుత్వం జమ చేయలేదు. దీంతో కోట్లాది మంది రైతులు ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 12 విడతల్లో డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసిన సంగతి తెలిసిందే. నేటికి ఈ పథకం ప్రారంభించి సంవత్సరాలు పూర్తయింది. దీంతో శుక్రవారం ప్రభుత్వం రైతుల ఖాతాలో నగదు జమ చేసే అవకాశం ఉందని అంచనా.. వేయగా ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో హోలీ సందర్భంగా వచ్చే గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మార్చి 8న హోలీ రోజు లబ్ధిదారుల ఖాతాలో 2 వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం జమ చేయనుందని అంటున్నారు. ఈసారి 14 కోట్ల మంది రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద లబ్ధి పొందనున్నారు. 


చిన్న, సన్నకారు రైతుల కోసం ఈ పథకాన్ని 2019లో కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ ఏడాది మధ్యంతర కేంద్ర బడ్జెట్‌ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ పథకం వివరాలను వెల్లడించారు. 2019 ఫిబ్రవరి 24 నుంచి ఈ పథకం అమలులో ఉండగా.. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు నేరుగా రూ.6 వేల నగదు జమ చేస్తోంది. ఏడాదికి మూడు వాయిదాల చొప్పున.. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేల నగదు అందజేస్తోంది.  


అదేవిధంగా ఈ-కేవైసీ పూర్తి చేయని రైతుల ఖాతాలకు డబ్బులు బదిలీ చేయమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మీరు ఇంకా ఈకేవైసీ పూర్తి చేయకుంటే మీరు లబ్ధిదారులు అయినా.. మీ అకౌంట్‌ నగదు జమ అవ్వదు. 


ఈ-కేవైసీ పూర్తి చేసుకోండి.. 


==>> పీఎం కిసాన్ యోజన pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
==>> వెబ్‌సైట్‌లో రైట్ సైట్ ఉన్న ఈ-కేవైసీ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
==>> ఇక్కడ మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
==>> ఓటీపీ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన తర్వాత.. ఆన్‌లైన్‌లో ఎంటర్ చేయండి.
==>> ఆ తరువాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
==>> ఇప్పుడు మీ ఈ-కేవైసీ కంప్లీట్ అవుతుంది. 


ఈ పథకానికి సంబంధించి మీకు ఏదైనా సమస్య తలెత్తితే హెల్ప్‌లైన్ నెంబర్ 155261 లేదా 1800115526 లేదా 011-23381092కు సంప్రదించాలి. అది కాకుండా pmkisan-ict@gov.in కు మెయిల్ చేయాల్సి ఉంటుంది.


Also Read: CM Jagan Mohan Reddy: వ్యవసాయ కనెక్షన్లపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. ఇక నుంచి మరింత వేగం


Also Read: Minister Gummanur Jayaram: మంత్రి గుమ్మనూరు కుటుంబంలో తీవ్ర విషాదం    



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి