PM Modi address to nation Live Updates: 100 crore vaccine milestone reflects image of new India, says PM Modi: వ్యాక్సినేషన్ పంపిణీలో 100 కోట్ల డోసులు అనేది కేవలం సంఖ్య కాదు.. అది దేశ సంకల్ప బలం అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi) అన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్‌లో (covid vaccination) భారత్‌ సరికొత్త చరిత్రను సృష్టించిన సందర్భంగా ప్రధాని నేడు దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. దేశ చరిత్రలో ఇది సరికొత్త అధ్యాయమని చెప్పారు. ఇది నవ భారతానికి ప్రతీక అని పేర్కొన్నారు. దేశ ప్రజల కర్తవ్య దీక్షతోనే ఈ లక్ష్యాన్ని చేరుకున్నామని ప్రధాని (Prime Minister) చెప్పారు. వీఐపీ సంస్కృతికి తావు లేకుండా ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ అందజేస్తున్నామని చెప్పారు. దేశంలో వ్యాక్సినేషన్‌పై (vaccination) ఎదురైన ఎన్నో ప్రశ్నలకు 100 కోట్ల వ్యాక్సినేషన్‌ (100 crore) ఘనతే సమాధానమని ప్రధాని స్పష్టం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మనకు అతిపెద్ద సవాల్‌ విసిరిందని.. ఇంత పెద్ద దేశానికి వ్యాక్సిన్ (vaccine) సరఫరా చేయడం అనేది నిజంగా సవాలే అని ప్రధాని అన్నారు. అయితే దాన్ని అధిగమించి నేడు వంద కోట్ల మైలురాయిని దాటామని చెప్పారు. ఇదంతా దేశ ప్రజల విజయని కొనియాడారు.


Also Read : PM Modi: ట్విటర్ ప్రొఫైల్ పిక్‌ మార్చిన మోదీ.. ఏం పెట్టారంటే...


కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ (vaccination) ద్వారా భారత శక్తి ఏంటో ప్రపంచానికి చూపించామన్నారు. శాస్త్రవేత్తల కృషి ఫలితంగానే స్వదేశీ వ్యాక్సిన్లను అతి త్వరగా అందుబాటులోకి తీసుకురాగలిగామని మోదీ వెల్లడించారు. సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్‌.. సబ్‌ కా విశ్వాస్‌.. సబ్‌ కా ప్రయాస్‌తోనే ఈ లక్ష్యాన్ని సాధించామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 


అభివృద్ధి చెందిన దేశాల్లో టీకాలు తీసుకోవడానికి ప్రజలు ఇంకా ముందుకు రావట్లేదన్నారు ప్రధాని మోదీ. అలాంటిది భారత్‌లో 100 కోట్ల డోసులు వేయించగలిగామని చెప్పారు. అయితే ఇంకా కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోలేదని మోదీ (PM Modi) స్పష్టం చేశారు. రాబోయే దీపావళి (deepavali) పండగను దేశ ప్రజలంతా జాగ్రత్తగా జరుపుకోవాలని సూచించారు.


Also Read : India Covid Updates: కొత్తగా 15,786 వేలకేసులు.. 231 మరణాలు.. 98.16% రికవరీ రేటు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి