న్యూ ఢిల్లీ:: ఫిబ్రవరి 8న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ బుధవారం 40 మంది స్టార్ క్యాంపెయినర్స్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపి నడ్డా ఉన్నారు. అంతేకాకుండా నటులు హేమా మాలిని, సన్నీ డియోల్, గాయకుడు హన్స్ రాజ్ హన్స్, భోజ్‌పురి తారలు రవి కిషన్ మరియు దినేష్ లాలా యాదవ్ 'నీరాహువా' , ఎంపీ గౌతమ్ గంభీర్ ఉన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70స్థానాలకు గాను, మూడు సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ, రెండు దశాబ్దాలుగా ఢిల్లీలో అధికారంలో లేని బీజేపీకి మద్దతివ్వమని పార్టీ కోసం కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, అనురాగ్ ఠాకూర్, ముక్తార్ అబ్బర్ నఖ్వీ, తవార్‌చంద్ గెహ్లోట్ లు ప్రచారం చేయనున్నారు.


బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, జైరాం ఠాకూర్, మనోహర్‌లాల్ ఖట్టర్, త్రివేంద్ర సింగ్ రావత్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రచారం చేయనున్నారు. 


ఢిల్లీ అసెంబ్లీకి ఒకే దశలో ఫిబ్రవరి 8న పోలింగ్ జరగనుండగా, కౌంటింగ్ ఫిబ్రవరి 11న జరుగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తిరిగి అధికారంలోకి రావాలని తీవ్రప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీ ఓటర్లకు మెట్రో రైళ్లలో, డీటీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాలు వంటి హామీలను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. 


మరో ప్రధాన పోటీదారు అయిన  కాంగ్రెస్ కూడా తిరిగి అధికారంలోకి రావాలని చూస్తోంది. పూర్వాంచల్ ఓటర్లను ఆకర్షించడానికి కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర జనతాదళ్ (ఆర్జెడి) తో పొత్తు పెట్టుకుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..