సాక్షాత్తు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీయే నిరాహారదీక్షకు కూర్చోనున్నారు. గురువారం ఆయన బీజేపీ ఎంపీలతో కలిసి ఢిల్లీలో ఒక రోజు నిరహార దీక్ష చేయనున్నారు. పదే పదే సమావేశాలకు భంగం కలిగిస్తున్న ప్రతిపక్షాల వైఖరిని.. సభకు ఆటంకం కలిగిస్తున్న ఇతర పార్టీల ప్రవర్తన  పట్ల తన వ్యతిరేకతను తెలిపేందుకే ఆయన ఈ దీక్ష చేయనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదే రోజు కర్ణాటక పర్యటనలో ఉన్న అమిత్ షా కూడా... అదే రాష్ట్రంలో ఈ దీక్ష చేయనున్నారు. అయితే తాను నిరాహార దీక్షలో ఉన్నంత మాత్రాన.. అధికారులతో మాట్లాడడం, ఫైల్స్ క్లియర్ చేయడం లాంటి పనులను వాయిదా వేయనని.. ఒక ప్రధానమంత్రిగా తను రెగ్యులర్‌గా చేయాల్సిన కార్యాలయ పనులు ఏవీ వాయిదా పడవని ఆయన తెలిపారు. 


బీజేపీ అధికార ప్రతినిథి జీ వీ ఎల్ నరసింహారావు మాట్లాడుతూ భారత  ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12న (గురువారం) నిరాహార దీక్ష చేయాలని సంకల్పించినట్లు తెలియజేశారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగకపోవడం వల్ల.. పదే పదే ఆటంకాల బారిన పడడం వల్ల.. ప్రజలపై కూడా ఎంతో భారం పడుతుందని.. ఈ విషయాన్ని బీజేపీ అర్థం చేసుకొని ప్రజలకు తెలియజేయడం కోసమే ఈ నిరాహారదీక్ష చేస్తున్నట్లు ఆయన తెలిపారు.పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో 23 రోజులు పూర్తిగా దుర్వినియోగం అయ్యాయని, ఆ రోజులకు వచ్చే వేతనాలను తీసుకోకూడదని ఇప్పటికే ఎన్డీయే ఎంపీలు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.