PM Modi: మానవత్వం చాటిన ప్రధాని మోదీ..అసలేమి జరిగిదంటే..!
![PM Modi: మానవత్వం చాటిన ప్రధాని మోదీ..అసలేమి జరిగిదంటే..! PM Modi: మానవత్వం చాటిన ప్రధాని మోదీ..అసలేమి జరిగిదంటే..!](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/styles/zm_500x286/public/2022/09/30/247000-pmmodi.jpg?itok=3F4AjcGT)
PM Modi: గుజరాత్‌లో ప్రధాని మోదీ విస్తృతంగా పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈనేపథ్యంలో అనుకోని ఘటన చోటుచేసుకుంది.
PM Modi: గుజరాత్‌లో ప్రధాని మోదీ టూర్ కొనసాగుతోంది. గతరెండురోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తూ..ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఈసందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది. అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్‌కు రోడ్డు మార్గంలో ప్రధాని మోదీ కాన్వాయ్ వెళ్తోంది. అదే సమయంలో అదే రోడ్డుపై అంబులెన్స్ వచ్చింది. దీంతో ప్రధాని మోదీ కాన్వాయ్‌ను పక్కకు ఆపి వేశారు. అంబులెన్స్ వెళ్లిన తర్వాత కాన్వాయ్ బయలుదేరింది.
ఈదృశ్యాలను కొందరు అధికారులు ఫోన్‌లో బంధించారు. ఈవీడియోన్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..అహ్మదాబాద్‌లో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌కు వెళ్లారు. అదే సమయంలోనే ప్రధాని కాన్వాయ్..అంబులెన్స్‌కు దారి ఇచ్చింది. ఈవీడియోను గుజరాత్ బీజేపీ మీడియా విభాగం సైతం సోషల్ మీడియాలో పంచుకుంది.
ప్రధాని మోదీ మానవత్వం చాటారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈవీడియో తెగ వైరల్ అవుతోంది. గత రెండురోజులపాటు గుజరాత్ రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. సూరత్, భావ్‌నగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వీటితోపాటు గాంధీనగర్-ముంబై మధ్య సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును జాతికి అంకితం ఇచ్చారు. అనంతరం రైలులో కొంత దూరం ప్రయాణించారు.
Also read:IND vs SA: కెప్టెన్‌గా ధోనీ రికార్డును బ్రేక్ చేసిన రోహిత్ శర్మ..!
Also read:Russia vs Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా క్రెమ్లిన్ దాడులు..23 మంది పౌరుల మృతి..28 మందికి గాయాలు..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.