ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెట్రో రైలును ప్రారంభించారు. సోమవారం మధ్యాహ్నం మేజెంటా లైనులో మెట్రో రైలును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ రైలు నోయిడాలోని బొటానికల్ గార్డెన్ నుంచి కల్కాజీ మందిర్ వరకు సేవలు అందించనుంది.  ఈ మెట్రో రైలు ప్రారంభోత్సవానికి యూపీ గవర్నర్ రామ్ నాయక్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 మోదీ మెట్రో రైలును ప్రారంభించి.. ఆ రైలులో కొంతదూరం ప్రయాణించారు. ఆయనతో పాటు గవర్నర్, సీఎం, పలువురు ప్రముఖులు  కూడా ప్రయాణించారు. అయితే ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందని కారణంగా ఢిల్లీ సీఎం క్రేజీవాల్ హాజరుకాలేదు. ఈ రైలు సేవతో  నోయిడా, దక్షిణ ఢిల్లీ మధ్య ప్రయాణ సమయం సగానికిపైగా తగ్గనుంది.